నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్ల వసూళ్ల మార్క్ ను ఈ సినిమా క్రాస్ చేసింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా అంచనాలకు మించి వచ్చింది. వంద కోట్ల వసూళ్లు దక్కించుకుని అఖండ విజయం అంటూ ఇప్పటికే అభిమానులతో అనిపించుకున్న బాలయ్య బోయపాటిల మూవీ ఖచ్చితంగా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది అనడానికి మరో సాక్ష్యం ఇదే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కొత్త విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. అదే రెండవ ఆదివారం కూడా అఖండ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఈమద్య కాలంలో రెండవ వారం కూడా హౌస్ ఫుల్ వసూళ్లు నమోదు అవ్వడం అనేదే లేదు.
మొదటి మూడు రోజులు భారీ వసూళ్లు దక్కించుకున్న అఖండ సినిమా వారం రోజల పాటు భారీగానే రాబట్టింది. రెండవ వారంలో అడుగు పెట్టే సమయంకు మరే సినిమాలు పోటీ లేక పోవడం వల్ల అనూహ్యంగా అఖండ భారీగానే రెండవ వారంలో కూడా వసూళ్లు రాబట్టింది. శని మరియు ఆదివారం లో అఖండ థియేటర్ల వద్ద భారీ ఎత్తున జనాలు క్యూలు కట్టారు. రెండవ శనివారం మరియు రెండవ ఆదివారం కూడా ఈ రేంజ్ లో వసూళ్లు నమోదు అవ్వడం చాలా అరుదైన సంఘటన అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. రెండవ వారంలో ఈ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి కనుకే వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అఖండ సినిమా విజయంతో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు జోష్ మీద ఉన్నారు. అఖండ సినిమా సక్సెస్ ముందు ముందు రాబోతున్న సినిమాలకు చాలా ఉత్సాహంను నింపుతున్నాయి. భారీగా పబ్లిసిటీ చేస్తే అంతకు మించిన ఓపెనింగ్స్ ను కూడా దక్కించుకోవచ్చు అంటూ మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. అఖండ సినిమా తో బాలయ్య భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఆయన నుండి రాబోతున్న తదుపరి సినిమాల విషయంలో ఆసక్తి నెలకొంది. బాలయ్య తదుపరి సినిమా సమ్మర్ లో రాబోతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతోంది. ఆ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నాడు.