తమిళ ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న మాస్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. అయితే అజిత్ తన మార్కెట్ ను గాని అలాగే ఫ్యాన్ ఫాలోవర్స్ గాని ఎంత పెరిగినా కూడా ఎలాంటి హడావిడి లేకుండా కనిపిస్తాడు. అంతేకాకుండా అతను ఫాన్స్ ను కలవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించడు. ఎందుకంటే తన కారణంగా ఫ్యాన్స్ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెబుతూ ఉంటాడు.
ఇక వివాదాలు జోలికి అసలే వెళ్ళని ఈ స్టార్ హీరో ఖాళీ సమయంలో మాత్రం తన ఫ్యామిలీతో టైమ్స్ పాండ్ చేసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అంతేకాకుండా బైక్ రైడ్స్ అంటే కూడా అతనికి ఎంతో ఇష్టం. ఇక ప్రస్తుతం అజిత్ కుమార్ కు సంబంధించిన కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ గా మారుతున్నాయి. ఈ సంక్రాంతికి అతని నుంచి తునివు సినిమా సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
అయితే షూటింగ్ పనులు మొత్తం అయిపోయి సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో అజిత్ సరదాగా ఫ్యామిలీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక అతని కూతురు అలాగే కొడుకుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. సీనియర్ హీరోయిన్ శాలినిని అజిత్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఫ్యామిలీ తప్పితే మరో ప్రపంచం తెలియని అజిత్ ఏ మాత్రం గ్యాప్ దొరికినా కూడా వారిని విదేశాలకు తీసుకువెళ్లి అక్కడే కొన్ని రోజులపాటు సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు.
ఇక అజిత్ కూతురు అయితే ప్రస్తుతం విదేశాల్లోనే చదువుకుంటుంది. ఆమె కూడా ప్రొడక్షన్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు గతంలో ఒక టాక్ కూడా వినిపించింది కానీ ఆ విషయంపై అజిత్ సన్నిహితులు ఏవిధంగా ను క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక మీడియాకు కూడా అజిత్ ఫ్యామిలీ చాలా దూరంగానే ఉంటుంది. మరి సంక్రాంతికి రాబోతున్న అజిత్ తునివు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా తెలుగులో తెగింపు అనే టైటిల్ తో రాబోతోంది.