అమితాబ్ కు ఆ పదం అస్సలు నచ్చదా?

భారతీయ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంగ్రీ యంగ్ మెన్ గా ఎంత మంది స్టార్లకు ఆదర్శంగా నిలిచిన అమితాబ్ బచ్చన్ దశాబ్దాలుగా ఇండియన్ సినిమాకు తన వంతు ఎంత చేయాలతో అంత చేస్తూనే వున్నారు. ఇప్పటికీ తనదైన మార్కు నటనతో ఆకట్టుకుంటూ విభిన్నమైన సినిమాలకు శ్రీకారం చుడుతూ ప్రేక్షకుల నీరాజనాలందుకుంటున్నారు.

దశాబ్దాల కాలం పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతూ భారతీయ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న అమితాబ్ బచ్చన్ కు ఓ పదం అంటే అస్సలు ఇష్టం వుండదట. ఆ పదంతో ఇండస్ట్రీని వేరు చేయడం తనకు పెద్దగా ఇష్టం వుండదని పలు సందర్భాల్లోనూ పలువురు ప్రముఖులతో అమితాబ్ చెప్పుకొచ్చారట. ఇదే విషయాన్ని తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ స్మృతి ముంద్రా వెల్లడించారు. అంతే కాకుండా సూపర్ స్టార్ అమితాబ్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాల్ని ఈ సందర్భంగా తెలిపారు.

బాలీవుడ్ అనే పదం వింటే అమితాబ్ ఎలా స్పందిస్తారో వెల్లడించారు. నేను మాట్లాడేటప్పుడు నా మాటల్లో బాలీవుడ్ అనే పదం వచ్చినపప్పుడు అమితాబ్ అలా మాట్లాడటం ఇష్టపడలేదు.

ఆయనకు అలా మాట్లాడటం ఎందుకు నచ్చలేదో నాకు మొదట్లో అర్థం కాలేదు. తరువాత కొంత మందితో ఈ విషయం గురించి మాట్లాడాను. ఆయనకు సినిమా పరిశ్రమను అలా వేరు చేసి మాట్లాడటం నచ్చదని అంతా అన్నారు.

అది విన్నాక అప్పటి నుంచి ఆయనతో మాట్లాడే టప్పుడు బాలీవుడ్ అనే పదం రాకుండా జాగ్రత్త పడ్డాను’ అని తెలిపారు స్మృతి ముంద్రా. ప్రముఖ ఓటీటీ దిగ్గజం ప్రత్యేకంగా 35 మంది బాలీవుడ్ సెలబ్రిటీలతో రూపొందించిన వెబ్ సిరీస్ ‘ది రొమాంటిక్స్’.

బాలీవుడ్ కు చెందిన రొమాంటిక్ సీన్స్ గీతాలకు సంబంధించిన ప్రత్యేక విశేషాలని ఇందులో చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ కు చెందిన ప్రముఖుల గురించి స్మృతి ముంద్రా మీడియాతో పంచుకున్నారు. ప్రేమికుల రోజున దీని స్ట్రీమింగ్ మొదలైంది.