కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఖుష్బూ గురించి అందరికీ తెలిసిందే. ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడే ఖుష్బూ హీరోయిన్ గా అప్పటి ప్రేక్షకులను అలరించగా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తమిళ్ సినిమాలే కాదు తెలుగులో కూడా ఆమె వరుస సినిమాలు చేస్తున్నారు. సినిమాలే కాదు జబర్దస్త్ షోలో పార్ట్ టైం జడ్జ్ గా ఉంటున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ కృష్ణ భగవాన్ ఉంటున్నారు. వీరిలో ఏ ఒక్కరు మిస్సైనా ఖుష్బూ అక్కడ ప్రత్యక్షమవుతుంది.
లేటెస్ట్ గా గోపీచంద్ హీరోగా వస్తున్న రామబాణం సినిమాలో కీలక పాత్రలో నటించారు ఖుష్బూ. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఓ స్పెషల్ చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె హీరోయిన్ టబుకి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని చెప్పుకొచ్చారు ఖుష్బూ.
అమితాబ్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన ఖుష్బూ చినీకం సినిమాలో టబు అమితాబ్ తో కలిసి రొమాన్స్ చేయడం తట్టుకోలేకపోయానని అన్నారు. చిన్నప్పుడు అమితాబ్ తో కలిసి నటించాను పెద్దయ్యాక కుదరలేదు.
అయితే తనకు రాని ఆ ఛాన్స్ టబు దక్కించుకున్నందుకు ఆమెకు ఫోన్ చేసి మరీ తిట్టిందట. అమితాబ్ తో రొమాన్స్ చేస్తే తాను చేయాలి నువ్వెందుకు చేశావ్.. ఆయనతో రొమాన్స్ చేసే హక్కు అర్హత తనకే ఉన్నాయని చెప్పిందట. అలా అమితాబ్ పై తనకు ఉన్న ఇష్టాన్ని వెల్లడించింది ఖుష్బూ.
చిరంజీవి బాలకృష్ణతో కూడా కలిసి నటించే అవకాశం కూడా చూస్తున్న అంటూ చెప్పారు. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో చూడాలి అలాంటి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా అన్నారు ఖుష్బూ.. తెలుగులో ఎలాగు సినిమాలు చేస్తున్నా కాబట్టి త్వరలోనే అలాంటి ఛాన్స్ అందుకుంటానని నమ్మకం ఉందని అన్నారు.
పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలో నటించిన ఖుష్బూ ఆ సినిమా ఎందుకు ప్రేక్షకులకు నచ్చలేదో తనకు అర్ధం కాలేదని అన్నారు. బహుశా పవన్ మదర్ గా తనని యాస్పెక్ట్ చేయలేదని అన్నారు. మా మధ్య మ్యూజిక్ మిస్ అయ్యి ఉండొచ్చని అన్నారు.