అరుదైన వ్యాధులతో బాధపడుతున్న అందాల భామలు వీరే..!

వెండితెరపై అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేసే చాలా మంది గ్లామరస్ హీరోయిన్లు.. తెర వెనుక అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటాం కానీ.. వారు కూడా రకరకాల సమస్యలతో బాధ పడుతుంటారు. చాలా మంది ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.

మనుషులన్నాక పలు రకాల వ్యాధులు రావడం సహజమే. కొన్ని మందులతో నయమైతే.. మరికొన్ని మాత్రం ఎన్ని మందులు వాడినా జీవితాంతం దీర్ఘకాలికంగా వెంటాడుతూనే ఉంటాయి. వారిలో కొందరు చికిత్స లేని ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారు.

ఇటీవల సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం అందరికీ షాకింగ్ గా మారింది. ఇది కండరాల క్షీణతకు సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని తెలుస్తోంది.

మయోసైటిస్ అనేది సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇది అత్యంత ప్రమాదకరంగా మారే వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం సమంత పాలీమార్ఫస్ లైట్ ఎరప్షన్ అనే చర్మ సంబంధించిన వ్యాధితో బాధపడినట్లు తెలుస్తోంది.

సినీ ఇండస్ట్రీలో సమంత తో పాటుగా అరుదైన వ్యాధులతో పోరాడుతున్నవారు చాలామంది హీరోయిన్లు ఉన్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా చాలాకాలంగా స్కిన్ అలర్జీ ప్రాబ్లమ్ తో బాధ పడుతున్నట్లు టాక్ ఉంది.

గోవా బ్యూటీ ఇలియానా సైతం డిమ్ మార్ఫిక్ బాడీ డిజార్డర్ అనే అరుదైన వ్యాధిని ఎదుర్కొంది. సోనమ్ కపూర్ కు డయాబెటిస్ ఉంటే.. కియారా అద్వానీకి బర్డ్ ఫోబియా ఉంది. స్నేహ ఉల్లాల్ కూడా ఒకరకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ని ఫేస్ చేసిందని తెలుస్తోంది.

బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె చాన్నాళ్ళు డిప్రెషన్ తో బాధ పడింది. ఎంతో కష్టపడి డిప్రెషన్ నుంచి బయటపడింది. ప్రస్తుతం లైవ్ లవ్ లాఫ్ అనే సంస్థ సహాయంతో దీపికా పదుకొనే డిప్రెషన్ తో బాధపడే వాళ్లకు చికిత్స అందేలా చూస్తోంది.

హీరోయిన్ అనుష్క శర్మ కూడా మానసిక ఆరోగ్య సమస్యతో బాధ పడుతోందని టాక్. పరిణీతి చోప్రా కూడా గతంలో డిప్రెషన్ నుంచి బయట పడింది. ఇక సోనాలి బింద్రే – మమతా మోహన్ దాస్ – మనీషా కోయిలారా – గౌతమి – మహిమా చౌదరి – లిసా రే వంటి పలువురు హీరోయిన్లు ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడి జయించారు.