బాలీవుడ్ నటి అలియాభట్ మాతృమూర్తి అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి అలియా అమ్మగా ప్రమోట్ అయింది. ఈ ఏడాది రణబీర్ కపూర్ తో వివాహం జరగడం..ఇదే ఏడాది ఓ బిడ్డకి తల్లి అవ్వడం అలియా భట్ సహా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా భావిస్తున్నారు. ప్రస్తుతం అలియాభట్ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది.
ఈ సందర్భంగా తల్లైనా తర్వాత తనలో వచ్చిన మార్పుల గురించి రివీల్ చేసింది. ‘తల్లిగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టాను. దీంతో నా వ్యక్తిగత జీవితంలో భారీ మార్పులే చోటు చేసుకున్నాయి. ఇంతకు ముందు కంటే మరింత స్వేచ్ఛంగా ఆలోచిస్తున్నా. అలా ఎందుకు జరుగుతుందో నాకే అర్ధం కావడం లేదు. నాలో వచ్చిన ఈ రకమైన మార్పులు నా జీవితంపై…నటనపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో కూడా అంచనా వేయలేకపోతున్నాను.
పాత్రల ఎంపికలో కూడా నిర్ణయాలు ఎలా ఉండబోతాయో ఇప్పుడే చెప్పలేను. నాభవిష్యత్ ఎలా ఉంటుందోనని నేను కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను’ అంటోంది. అలియా వ్యాఖ్యల్ని బట్టి తనలో నటనపై ఆసక్తి తగ్గిందా? నటిగా రిటైర్మెంట్ తీసుకుంటుందా? అన్న సందేహం తెరపైకి వస్తోంది. సాధారణంగా తల్లైన తర్వాత చాలా విషయాలపై అనాసక్తి పెరుగుతుంది.
ఇంటికే పరిమితమవ్వాలి. కుటుంబాన్నిచూసుకుంటే చాలు. అంతకు మించి సాధించేది ఏముంటుందని అన్న రకంగా సాధారణంగా చాలా మంది మహిళలు ఆలోచిస్తారు. మరి అలియాభట్ లో వస్తోన్న మార్పులు అలాంటివే అయితే అభిమానులు నిరుత్సాహ పడాల్సిందే.
ఏక్షణమైనా సినిమాల నుంచి నిష్ర్కమిస్తున్నట్లు ప్రకటనొస్తే ఎన్ని హృదయాలు గాయపడతాయో చెప్పాల్సిన పనిలేదు.
అలియా దయచేసి అలాంటి నిర్ణయాలతో మీడియా ముందుకు రాకూడదని ఆశిద్దాం. ప్రస్తుతం అలియాభట్ చేతిలో కొన్ని బాలీవుడ్ సినిమాలున్నాయి. ఇప్పుడిప్పుడే లేడీ ఓరియేంటెడ్ నాయికగాను ఎదుగుతోంది. అలాగే ఓ హాలీవుడ్ సినిమాలోనూ నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసింది. కానీ ఇంతలోనే అలియా వ్యాఖ్యలు ఫ్యాన్స్ లో కలవరం రేపుతున్నాయి.