అలియా కొత్తిల్లు.. ఎన్ని కోట్లో తెలుసా..?

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ భారీ మొత్తం తో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇప్పటికే ముంబైలో రణ్ బీర్ తో కలిసి 8 అంతస్తుల బిల్డింగ్ ని కట్టిస్తున్న అలియా భట్ కొత్తగా మరో ఇల్లు కొనేసిందట. ఈ ఇంటి ఖరీదు 37 కోట్ల రూపాయలని తెలుస్తుంది.

రీసెంట్ గానే ఈ ఇంటిని కొని తన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందట. ఈ ఇంటి స్టాంప్ డ్యూటీ కోసమే దాదాపు 3 కోట్ల దాకా ఖర్చు అయినట్టు తెలుస్తుంది. భర్త రణ్ బీర్ కపూర్ తో కలిసి అలియా భట్ ఒక భారీ ఇంటిని నిర్మిస్తుంది.

ముంబైలో ఆ ఇంటిని నిర్మిస్తూనే మరో ఖరీదైన ఇల్లు సొంతం చేసుకుంది అలియా భట్. ఓ పక్క ఈ ఇంటిని కొంటూ మరోపక్క తన రెండు విల్లాలను తన సోదరికి గిఫ్ట్ గా ఇచ్చేసింది అలియా భట్. వాటి ఖరీదు కూడా 7 8 కోట్ల దాకా ఉంటాయని తెలుస్తుంది.

ప్రస్తుతం బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్న అలియా భట్ సినిమాకు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుంది. సినిమాల ద్వారా వచ్చిన మొత్తాన్ని ఇల్ల రూపంలో కొనేస్తూ ఉంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్న అలియా భట్ చూస్తుంటే తన ఫాం ని ఇంకొన్నాళ్లు కొనసాగించేలా ఉంది.

ఆర్.ఆర్.ఆర్ తో తెలుగు తెరకు పరిచయమైంది అలియా భట్. ఆమె డెడికేషన్ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే ట్రిపుల్ ఆర్ మొదటి ప్రెస్ మీట్ లో తెలుగు మాట్లాడటం రాని అలియా రెండో ప్రెస్ మీట్ కు తెలుగులో రెండు మాటలు నేర్చుకుంది. ఇక భర్త రణ్ బీర్ తో చేసిన బ్రహ్మాస్త్ర సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ టైం లో కూడా ఆ సినిమాలోని పాటని తెలుగులో పాడి అలరించింది అలియా భట్.

వర్క్ మీద ఆమెకు ఉన్న డెడికేషన్ లెవెల్స్ గురించి అందరు చెప్పుకుంటారు. ఇక ఓ పక్క రెస్ట్ లెస్ గా సినిమాలు చేస్తూ మరోపక్క సంపాదించిన మొత్తాన్ని ఇన్వెస్ట్ మెంట్ రూపంలో విల్లాలు కొంటుంది అలియా భట్. అలియా కొత్తగా కొన్న ఇల్లు గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.