అలియా భట్.. బేబీ బంప్ కవర్ చేసినా అదే గ్లామర్!


బాలీవుడ్ బ్యూటీఫుల్ హీరోయిన్ ఆలియా భట్ నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంతో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఇటీవల తన ప్రియడు రణ్ బీర్ కపూర్ ను అమ్మడు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక అలా పెళ్లి చేసుకుందో లేదో ప్రెగ్నెన్సీ న్యూస్ తో షాక్ ఇస్తోంది. ఇక ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా సినిమా షూటింగ్స్ ప్రమోషన్స్ లో కూడా అదే ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఉండడం విశేషం.

ఆ మధ్య అలియా భట్ ఒక షూట్ లో బేబీ బంప్ తో ఉండగానే షూట్ లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ సినిమా ప్రమోషన్ లో కూడా ఆమె బిజీగా మారింది. ఆమె వర్క్ డెడికేషన్ చూస్తున్న ఓ వర్గం నెటీజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అలియా భట్ సోమవారం ఉదయం తన రాబోయే చిత్రం ‘డార్లింగ్స్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కనిపించింది.

షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్తో కలిసి నిర్మాతగా అలియా తొలిసారిగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆమెకు చాలా ప్రత్యేకంగా మారింది. ఇక ఆ ఈవెంట్ లో అలియా భట్ బాబీ బంప్ కనిపించకుండా జాగ్రత్త పడింది.

పొట్టి గౌనులో అలియా బేబీ బంప్ ను దాచేస్తూ మరోవైపు లెగ్స్ అందాలను హైలెట్ చేసింది. ఇక అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక డార్లింగ్ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని అలియా ప్రమోషన్స్ చేస్తోంది.

ఇక అలియా RRR సినిమా అనంతరం గంగుభాయ్ ఖతీయవాడి సినిమాతో నటిగా మంచి ప్రశంసలు అందుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేదు. దీంతో డార్లింగ్ సినిమా ఆమెకు ముఖ్యంగా మారింది. మరి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అలాగే బ్రహ్మాస్త్ర సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విడుదల కాబోతోంది.