అల్లు రామాయ‌ణం: శ్రీ‌రాముడిగా ర‌ణ‌బీర్.. రావ‌ణుడిగా య‌ష్‌?

భారతీయ పురాణేతిహాసం రామాయణంపై అల్లు అర‌వింద్-మ‌ధుమంతెన కాంబినేష‌న్ భారీ సినిమాకి ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే. నితేష్ తివారీ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఈ భారీ పాన్ వ‌రల్డ్ చిత్రం సెట్స్ కెళ్లేది ఎప్పుడు? ఆదిపురుష్ ప‌రాజ‌యం త‌ర్వాత దీనిపై మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఇది ప‌రిశ్ర‌మ దృష్టిలో మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో ఉంది. సెట్స్ కి వెళ్లేంద‌కు ఇంకెంతో స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని భావిస్తున్నారు.

అంతేకాదు ఈ చిత్రంలో హృతిక్ రోష‌న్ శ్రీ‌రాముడి పాత్ర‌లో న‌టిస్తార‌ని దీపిక ప‌దుకొనే సీతగా న‌టిస్తుంద‌ని కూడా ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. కానీ అవేవీ నిజాలు కాద‌ని ప్రూవ్ అయింది. తాజా స‌మాచారం మేర‌కు..రణబీర్ కపూర్ – అలియా భట్ జంట శ్రీ‌రాముడు- సీత పాత్రలలో నటించబోతున్నారని క‌థ‌నాలొస్తున్నాయి. అంతేకాదు.. ఇందులో న‌టించేందుకు య‌ష్ పై లుక్ టెస్ట్ కూడా చేశార‌ని తెలిసింది. అత‌డు రావ‌ణుడిగా న‌టించే అవ‌కాశం ఉంద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఒక క్లోజ్ సోర్స్ వివ‌రాల ప్ర‌కారం.. నితేష్ తివారీ – మధు మంతెన – నమిత్ మల్హోత్రా త‌దిత‌ర బృందం ఈ భారీ ప్రాజెక్ట్ పై నెమ్మదిగా స్థిరంగా పనిచేస్తున్నారు. మేకర్స్ ఏ విష‌యంలోనూ తొందరపడటం లేదు. ప్రాజెక్టును ఖ‌రారు చేసే ముందు ప్రతి అడుగు కోసం తగినంత సమయం తీసుకుంటారు అని తెలుస్తోంది.

ప్రధాన పాత్రల ఎంపిక లో..రణబీర్ కపూర్ గురించి ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఇంకా ఆలియాను సంప్ర‌దించ‌లేదు. నిజానికి సీత పాత్ర కోసం ఎవ‌రినీ ఎంపిక చేయ‌లేదు. ఇంకా ఎవరినీ సంప్రదించలేదు అని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ర‌ణ‌బీర్ శ్రీ‌రాముడు అయితే సీత‌గా ఆలియాకే అవ‌కాశం వ‌రిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

సీత పాత్ర‌ధారి ఎంపికకు ముందే రావ‌ణుడి పాత్ర‌ను ఫైన‌ల్ చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్నారు. దీనికోసం యష్ పై ప‌లు ర‌కాలుగా లుక్ టెస్టులు చేసారు. యష్‌ ఇంకా ఖరారు కాలేదు. సీత -హనుమంతుల పాత్ర‌ల కోసం నటీనటుల ఎంపికకు కొంత సమయం పడుతుంది. కొన్ని నెలలు ప‌ట్టొచ్చు.. నిర్మాత‌లు ఒక ప‌టిష్ఠ‌మైన సినిమాని తీయాల‌ని అనుకుంటున్నారు.

దాని కోసం కొన్ని సంవత్సరాలు వెచ్చించ‌నున్నార‌ని తెలిసింది. క్వాలిటీ వ‌ర్క్ కోసం చాలా సమయం తీసుకుంటున్నారని కూడా తెలుస్తోంది. దంగల్ కోసం నితేష్ తివారీ రెండేళ్ల స‌మ‌యం వేచి చూసాడు. అతను అంకితభావం ఉన్న దర్శకుడు. మంచి ఉత్పత్తిని అందించ‌డానికి తన సమయాన్ని ఎక్కువ వెచ్చిస్తాడు. దంగల్ జనవరి 2014లో ప్రకటించారు. డిసెంబర్ 2016లో విడుదలైంది అని కూడా విశ్లేషించారు.