‘ఆమె ఒక పోర్న్ స్టార్.. ప్రముఖులను బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది’

బాలీవుడ్ భామలు రాఖీ సావంత్ మరియు షెర్లిన్ చోప్రా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గ్లామర్ రోల్స్ – హాట్ ఎక్స్ ఫోజింగ్ తో అదరగొట్టే ఈ ఇద్దరూ.. సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. వివాదాలు కూడా వీరిని ఎక్కువగా పాపులర్ చేశాయి. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతోంది.

రాఖీ సావంత్ ను ‘చర్బీ కి దుకాన్’ (కొవ్వు పట్టిన దుకాణం) అని షెర్లిన్ పిలిస్తే.. ప్రతిస్పందనగా షర్లిన్ ఒక ‘పోర్న్ స్టార్’ అని రాఖీ కామెంట్ చేసింది. బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ ను రాఖీ సమర్దించడం.. దీనిపై షెర్లిన్ ఫైర్ అవ్వడంతో మొదలైన రచ్చ ఇద్దరి మధ్య పెద్ద గొడవకు దారి తీసింది.

ఇటీవల కాలంలో సాజిద్ ఖాన్ పై పలువురు నటీమణులు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అతను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పలువురు ఆరోపించారు. సాజిద్ ని విమర్శించిన వారిలో షెర్లిన్ చోప్రా కూడా ఉంది. అయితె ఇప్పుడు రాఖి సావంత్ దర్శకుడు సాజిద్ కి మద్దతుగా నిలిచింది.

అతడిని వేధించింది చాలు.. ఇప్పటికే సాజిద్ శిక్ష అనుభవించాడు.. ఆఫర్స్ కూడా కోల్పోయాడు. ఇంకా అతన్ని విమర్శిస్తే ఆత్మహత్య చేసుకుంటాడు అని రాఖీ సావంత్ రీసెంట్ గా కామెంట్స్ చేసింది. దీంతో సాజిద్ కి రాఖీ సపోర్ట్ గా నిలవడం పై షెర్లిన్ చోప్రా తీవ్ర విమర్శలు చేసింది.

షెర్లిన్ మాట్లాడుతూ.. “ఇది నాన్సెన్స్.. ఏం మాట్లాడుతున్నావు. జిమ్ కి వెళ్లి కండలు పెంచుకోడానికి వెయిట్ లిఫ్టిగ్ లిఫ్టింగ్ చేయి. నీ బాయ్ ఫ్రెండ్స్ నీతో టైం పాస్ చేసి వెళ్ళిపోతారు. నీకు కష్టపడి పని చేయడం కంటే 24 గంటలూ మీడియా ముందు వాగడమే ఇష్టం. దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడు” అంటూ రాఖీని అనుకరిస్తూ కౌంటర్ ఇచ్చింది.

దీంతో తరచుగా వివాదాలతో సహవాసాలు చేసే రాఖీ.. షర్లిన్ చోప్రా పై విరుచుకుపడింది. నోటికి పని చెబుతూ తీవ్ర విమర్శలు చేసింది. షెర్లిన్ ఒక పోర్న్ నటి అని.. సెక్స్ రాకెట్ ను నడుపుతుందని.. పెద్ద పెద్ద వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేస్తుందని రాఖీ ఆరోపించింది.

షెర్లిన్ ఫోటోలను చూపిస్తూ.. “ఇవి చూడండి.. ఆమె ఒక పోర్న్ స్టార్. ప్రముఖులను ప్రలోభపెట్టి ఆ వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేయడం ఆమె పని. ఒకసారి అలీబాగ్ లో సెక్స్ రాకెట్ లో కూడా పట్టుబడింది” అంటూ రాఖీ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

శృంగార వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. నువ్వు పోర్న్ నటివి.. నేను నటిని.. నీకు నా గురించి మాట్లాడే అర్హత లేదు. అరికాలి నుంచి ముఖం వరకు మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న ఆమె కూడా నా గురించి మాట్లాడుతోంది అంటూ రాఖీ సావంత్ తనదైన శైలిలో షెర్లిన్ ను అనుకరిస్తూ వెక్కిరించింది.

రాఖీ సావంత్ మరియు షెర్లిన్ చోప్రాల మధ్య మాటల యుద్ధానికి తెరపడలేదు. రాఖీ కామెంట్స్ కు షెర్లిన్ మళ్లీ కౌంటర్ ఇచ్చింది. రాఖీ ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఈవెంట్స్ ఏర్పాటు చేయడమే కాదు.. వాటిల్లో పాల్గొంటుందని.. భర్తలను బాయ్ ఫ్రెండ్స్ ని సబ్ స్క్రిప్షన్ ప్రాతిపదికన మారుస్తూ ఉంటుందని చోప్రా వ్యాఖ్యానించింది.

షెర్లిన్ మరియు రాఖీల మధ్య అసభ్యకరమైన మాటల యుద్దం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ అగ్లీ ఫైట్ ని ఏ విధంగా ముగిస్తారో చూడాలి.