ఎస్ ఎస్ రాజమౌళి గత నెలలో ఎలాగైనా ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ ను తిరిగి మొదలుపెడదామని విపరీతంగా ప్రయత్నించాడు. టెస్ట్ షూట్ చేసి అందరిలో కాన్ఫిడెన్స్ ను నింపాలని భావించాడు. అయితే ఈ పరిస్థితుల్లో షూట్ చేయడం అనుకున్నంత సులువు కాదని గ్రహించి చివరికి వెనక్కి తగ్గాడు. ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రభావం వల్ల మరో రెండు నెలలైనా షూటింగ్స్ ను మొదలుపెట్టలేని పరిస్థితి.
తాజాగా రాజమౌళి గురించి వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోని తన ఇంటి నుండి నగర శివార్లలో ఉన్న తన ఫామ్ హౌజ్ కు షిఫ్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మహేష్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పనులను మొదలుపెట్టినట్లు వార్తలు వచ్చాయి కానీ రాజమౌళి క్లోజ్ సోర్స్ ల నుండి తెల్సింది ఏంటంటే జక్కన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షిస్తున్నాడట. కథ నరేషన్ లో భాగంగా కొన్ని సీన్లను యానిమేషన్ లో చూపించాలని జక్కన్న అండ్ కో డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ పోషిస్తున్న పాత్రల స్వభావాన్ని, క్లైమాక్స్ లో వీరిద్దరి మధ్య కొంత పార్ట్ ను యానిమేషన్ లో తీయాలని అనుకున్నారట. ప్రస్తుతం ఈ పార్ట్ యానిమేషన్ వర్క్స్ ను ఒక టీమ్ కు అప్పగించారట. ఆ పనులను పర్యవేక్షిస్తున్నాడట జక్కన్న.