ఆర్జీవీ డీకంపెనీతో పెట్టుకుని బుక్కైంది!


నైనా గంగూలీ .. పరిచయం అవసరం లేదు. ఆర్జీవీ డిస్కవరీగా ఇప్పటికే సుపరిచితం ఈ బ్యూటీ. రామూజీ తెరకెక్కించిన `వంగవీటి` సినిమాలో రత్నకుమారి పాత్రలో నటించి మెప్పించిన ఈ భామ ఆ తర్వాత ట్రెడిషన్ కి భిన్నంగా గ్లామరస్ పాత్రలతో మెరిపిస్తోంది.

ఇంతకుముందు ఆర్జీవీ కాంపౌండ్ లోనే `బ్యూటిఫుల్` అనే సినిమాలో నటించింది. నైనాలో కాకలు పుట్టించే హీట్ కి కుర్రకారు గుండెల్లో గుబులు రేగింది. అటుపైనా వరుసగా సోషల్ మీడియాల్లో వేడెక్కించే ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఈ బ్యూటీ. తదుపరి బ్యూటిఫుల్ ని మించి `డేంజరస్` అంటూ లెస్బియన్ కాన్సెప్ట్ ఉన్న సినిమాతో వేడి పెంచనుంది. `జోహార్` అనే వేరొక మూవీలోనూ నాయికగా నటించిన ఈ బ్యూటీ వరుసగా ట్రీటివ్వనుందిట. ఆర్జీవీ డీ కంపెనీ.. నైనాకు కావాల్సినంత పబ్లిసిటీ నిస్తోంది. తనని క్రేజీగా ప్రమోట్ చేస్తోంది.

ఇక నైనా వరుస ఫోటోషూట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా అగ్గిరాజేసే లుక్ తో అభిమానులకు ఇన్ స్టా వేదికగా ట్రీటిచ్చింది నైనా. దేబశిష్ మిత్రా ఫోటోగ్రఫీలోని రేర్ ఫోటో ఇది. “మేక్ ఇట్ లుక్ ప్రెట్టీ.. బట్ ట్రైన్ ఇట్ టు కిల్“ అన్న వేడెక్కించే క్యాప్షన్ ని జోడించింది. ప్రస్తుతం అభిమానులు వైరల్ గా షేర్ చేస్తున్నారు. అయితే ఆర్జీవీ డీ కంపెనీతో పెట్టుకున్న ఈ అమ్మడికి సక్సెస్ ఎప్పటికి వస్తుంది? అన్నదే సందేహం!