ప్రముఖ హాస్య నటుడు ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా రమీజున్ వివాహం గత రాత్రి హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో సినీ ఇండస్ట్రీకి చెందిన మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు కింగ్ నాగార్జున అమల దంపతులు నటి ఏపీ మంత్రి రోజా తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు హాజరై నూత వధూవరులని ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలువీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
ఈ వివాహ వేదుకలో సతీసమేతంగా పాల్గొన్న చిరంజీవి .. వేదికపై ఆలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అంతే కాకుండా స్టేజ్ పై తన శ్రీమతి సురేఖతో కలిసి ఆలీ ఫ్యామిలీతో ప్రత్యేకంగా ఫొటోలకు పోజులిచ్చారు. అదే తరహాలో హీరో నాగార్జున అమల కూడా ఆలీ ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు. ఈ జంటతో కలిసి రోజా కూడా ఫొటోలకు ఫోజులివ్వడం ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో రోజు పంచుకున్నారు.
ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మురళీమోహన్ బ్రహ్మానందం విక్టరీ వెంకటేష్ వేణు తొట్టెంపూడి.. నుంచి ఆకాష్ పూరి వరకు ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు ఈ వివాహ వేడుకు హాజరయ్యారు.
ఇండస్ట్రీ నుంచి ఇంత మంది ఆలీ కూతురి పెళ్లికి హాజరైనా తనక అత్యంత సన్నిహితులైన పవన్ కల్యాణ్ మాత్రం హాజరు కాకపోవడంపై చర్చ జరుగుతోంది. పవన్ తో అలీది ప్రత్యేక అనుబంధం.
వెండితెరపై వీరి కాంబినేషన్ కూడా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అన్నది అందరికి తెలిసిందే. పవన్ రాజకీయాల్లోకి ప్రవేశించాక వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పవన్ జనసేన స్థాపించి టీడీపీకి సపోర్ట్ గా వ్యవహరించడం.. ఇదే సమయంలో కమెడియన్ ఆలీ వైఎస్సార్ సీపీ పార్టీలో చేరడం.. తనకు ఇటీవల ఎలక్ట్రానికి మీడియా సలహాదారుగా ఆలీని నియమించడం తెలిసిందే. గత కొంత కాలంగా ఆలీని పవన్ కల్యాణ్ దూరం పెడుతూ వస్తున్నారని వినిపిస్తున్న వార్తలకు తాజాగా ఆలీ కూతురు పెళ్లిలో కనిపించకపోవడంతో మరింత బలం చేకూరింది.
ఇండస్ట్రీలో ఆలీతో సన్నిహితంగా వుండే ఎంతో మంది వివాహ వేడుకలో హాజరయ్యారు కానీ పవన్ మాత్రం హాజరు కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం పవన్ విజయవాడలో వున్నారు. పవన్ రాకపోయినా చిరు వైఫ్ సురేఖతో కలిసి ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. ఇదిలా వుంటే ఈ వేడుకలో ఏపీ సీఎం. జగన్ కూడా పాల్గొనలేదు. త్వరలో జరగనున్న రిసెప్షన్ లో పాల్గొంటారని తెలుస్తోంది. రిసెప్షన్ మంగళవారం గుండూరులో జరగనుంది.