సినీ వర్గాల వారు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డుల వేడుక ఎట్టకేలకు సోమవారం నాడు ఘనంగా ముగిసింది. దేశ విదేశాల నుంచి హాజరైన సినీ ప్రముఖులందరూ ఈ ఆస్కార్ వేదిక మీద సందడి చేశారు. భారతదేశంలో రెండు కేటగిరీలలో ఆస్కార్ అవార్డు లభించాయి.
ది బెస్ట్ ఒరిజినల్ స్కోర్ కేటగిరీతోపాటు బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో కూడా ఒక ఆస్కార్ అవార్డు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ అత్యంత ఆసక్తికరంగా గమనించే ఈ ఆస్కార్ వేడుక జరపడానికి భారీగా ఖర్చు అవుతుంది. సాధారణంగా ఒక ఇంట్లో పెళ్లి వేడుక చేయాలంటేనే ఇప్పుడు లక్షలు ఖర్చు అవుతుంది. ఈ వేడుక జరపాలంటే చాలా ఎక్కువ ఖర్చవుతుంది అని అంటున్నారు.
ఈ వేడుకలు ఖర్చు సుమారుగా 463 కోట్లు. 95 ఆస్కార్ అవార్డుల ఈవెంట్ ఖర్చు దాదాపు 463 కోట్ల రూపాయలైనట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. నిజానికి ఒక్కొక్క ఆస్కార్ అవార్డు రూపొందించడానికి 50వేల రూపాయల ఖర్చు అవుతుందట. కంచుతో చేసిన ఈ ప్రతిమకు బంగారు పూత పూస్తారు. అలాగే ఆస్కార్ అవార్డు వేడుకకు వచ్చే సినీ నటులు సెక్యూరిటీ వారి హోటల్ ఖర్చులు డిన్నర్ ఖర్చులు హాల్ బుక్ చేస్తే దాన్ని ఖర్చు స్టేజ్ అరేంజ్మెంట్స్ లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు రెడ్ కార్పెట్ ఏర్పాటు చేయడం వందల మంది ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్లు సహా మిగతా ఈవెంట్లకు జరిపే కామన్ ఏర్పాట్లు అన్నీ చేస్తారు.
సాధారణంగా రెడ్ కార్పెట్ యే వాడుతారు. కానీ ఈసారి శాంభైన రంగు కార్పెట్ వాడారు. ఈ కార్పెట్ ఖరిదు మాత్రం దాదాపు 21 లక్షలు ఉంటుందంట. అలా ప్రతి చిన్న విషయాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ ఆస్కార్ అవార్డుల వేడుక నిర్వహించడానికి దాదాపుగా 463 కోట్లు ఖర్చయిందట. వినడానికి ఆశ్చర్యకరంగానే ఉన్న ఈ లెక్కలు మాత్రం భలే షాకిస్తున్నాయి కదూ. మనం ఇంట్లో కూర్చుని టీవీలో చూసే ఈ అవార్డులకు దాదాపు 463 కోట్లు ఖర్చు అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా మరి.