క్వీన్ కంగన రనౌత్ హిందూత్వను భాజపాను సమర్థిస్తున్న సంగతి తెలిసిందే. భాజపా తరపున హిమచల్ ప్రదేశ్ మండిలో కంగన ఎమ్మెల్యే పదవి కోసం పోటీకి దిగుతోంది. అయితే కంగన రాజకీయాలను తన సహనటి స్వరాభాస్కర్ తూర్పారబడుతోంది. కంగన అభిప్రాయాలను ఈ భామ విభేధిస్తోంది.
స్వర భాస్కర్ వర్సెస్ కంగనా రనౌత్ ఎపిసోడ్స్ గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ ఒకరితో ఒకరు చాలా సంవత్సరాలుగా విభేదిస్తున్నారు. ఇద్దరివీ భిన్నమైన వ్యక్తిత్వాలు.. భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇద్దరు నటీమణులు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన `తను వెడ్స్ మను`లో కలిసి పనిచేశారు. అయితే వారి వ్యక్తిగత వైరం దృష్ట్యా వారు మళ్లీ ఒక చిత్రంలో కలిసి పనిచేయడం చాలా కష్టం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వర మాట్లాడుతూ, రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు తనను కంగనాను ఎల్లప్పుడూ ఒకే ఫ్రేమ్‌లో ఉంచుతారని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలు తరచుగా మరచిపోయే విషయం ఏమిటంటే రాజకీయ వైఖరికి వచ్చినప్పుడు ఇరువురి మధ్య చాలా తేడా ఉంటుందని తెలిపారు.
ఇషాన్ వెమ్రాతో ఒక ఇంటర్వ్యూలో స్వర భాస్కర్ తన రాజకీయ అభిప్రాయం గురించి గళం విప్పారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు ప్రభుత్వం అంటే భయం మొదలైందని ఆమె అన్నారు. రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడటం వల్ల తన నటనా వృత్తి కూడా ప్రమాదంలో పడిందని స్వరా అంగీకరించింది. ప్రజలు కంగనా రనౌత్‌ని ..తనను రాజకీయ అభిప్రాయాల గురించి మాట్లాడే విషయంలో తరచుగా ఎలా చూస్తారో స్వరా చెప్పింది. కంగనా తరచుగా ప్రభుత్వాన్ని ప్రశంసించడం ద్వారా వారికి అనుకూలంగా మాట్లాడుతుందని .. అయితే తనకు ఏదైనా తప్పు అనిపిస్తే ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నిస్తానని అన్నారు.
అదే ఇంటర్వ్యూలో ప్రేమ భాష మాట్లాడే ఏ ప్రభుత్వానికైనా తాను మద్దతిస్తానని స్వరా పేర్కొంది. తనకు రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ అంటే ఇష్టమని, దేశంలో గణనీయమైన మార్పులను తీసుకురాగల శక్తి ఆయనకు ఖచ్చితంగా ఉందని స్వరా అన్నారు.
స్వరా – కంగనాల వైరం గురించి స్వరా మాట్లాడుతూ.. క్వీన్ స్త్రీవాదాన్ని ఎలా ప్రారంభించింది? అనేదానిపై కంగనా ప్రకటనను స్వరా ఎగతాళి చేయడంతో ఆ ఇద్దరి మధ్యా గొడవ ప్రారంభమైంది. దానికి సమాధానంగా కంగనా స్వరను బి గ్రేడ్ నటి అని కామెంట్ చేసింది. వారి మధ్య గొడవ ఇప్పటి వరకు అలాగే కొనసాగుతోంది. స్వర గురించి చెప్పాలంటే.. గత సంవత్సరం తనకు కుమార్తె జన్మించింది. స్వరా రాజకీయ నాయకుడు ఫహద్ అహ్మద్‌ను వివాహం చేసుకుంది.