ఆ బ్యూటీకి చాన్స్ ఇవ్వని పాన్ ఇండియా హిట్ ఇది!

‘కేజీఎఫ్’ రెండు భాగాలు పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ఆ సినిమాతో యశ్ పెద్ద స్టార అయిపోయాడు. దర్శకుడు పాన్ ఇండియాలో అవకాశాలు క్యూ కడుతున్నాయి. అదీ వందల కోట్ల రూపాయల సినిమాలు నిర్మించే అవకాశాలు వస్తున్నాయి. మిగతా టెక్నికల్ టీమ్ కి అన్ని భాషల్లోనూ ఛాన్సులొస్తున్నాయి. అగ్ర దర్శక-నిర్మాతలు అవకాశాలు కల్పిస్తున్నారు.

మరి అందులో నటించిన హీరోయిన్ శ్రీనిధి పరిస్థితి ఏంటి? అంటే! ఆమె కెరీర్ కేవలం ఆ సినిమా వరకే పరిమితం అయినట్లు కనిపిస్తోంది. కేజీఎఫ్ హిట్ తర్వాత అమ్మడు విక్రమ్ హీరోగా నటించిన కోబ్రాలో నటించింది.భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా దారుణమైన ఫలితాలు సాధించింది. ఈ సినిమా గతేడాది ఆగస్టు లో రిలీజ్ అయింది. అంటే ఏడాది సమీపిస్తుంది.

మరి శ్రీనిధి పరిస్థితి ఏంటి? అంటే ఇప్పటివరకూ మళ్లీ మరో సినిమాలో నటించే ఛాన్స్ రాలేదు. వైఫల్యం కారణంగా ఛాన్స్ రాలేదంటే? పర్వాలేదు. కానీ ‘కేజీఎఫ్’ లాంటి సక్సెస్ ఉన్నా హీరోయిన్ గా బిజీ కాకపోవడం మాత్రం ఆశ్చర్యకరమైన అంశమే.

ఇది నిజంగా అమ్మడి బ్యాడ్ లక్ అనే అనాలి. ఎలాంటి విజయమాలు లేకుండానే చాలా మంది ఛాన్సులందుకుంటున్నారు. ఏదో భాషలో ఏదో సినిమా చేస్తూ కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నారు.

కానీ శ్రీనిధి మాత్రం అలా ప్లాన్ చేసుకున్నట్లు కనిపించలేదు. అవకాశాలు వస్తే చేయడం లేకపోతే లేదు అన్నట్లే వైఖరి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించదు. గ్లామర్ అప్పీరియన్స్ కి తొలి నుంచి దూరమే.

‘కేజీఎఫ్’ లోనూ అమ్మడు డీసెంట్ గానే కనిపించింది. ‘కోబ్రా’లోనూ అలాగే కనిపించింది. ఆరంకగా గ్లామర్ పాత్రలకు శ్రీనిధి దూరమని తెలుసతోంది. అయితే ఇదే నిబంధన అమ్మడిని రేసులో వెనక్కి నెట్టినట్లు చెప్పొచ్చు.