ఇండస్ట్రీలో హిట్టుకే విలువ ఎక్కువ.. ఇక్కడ హిట్టు లేదన్నా.. వరుసగా ఫ్లాపులు డిజాస్టర్లు పలకరించినా.. వెంటనే డేంజర్ బెల్స్ మోగిపోతుంటాయి. కెరీర్ పై నీలి నీడలు కమ్మేస్తుంటాయి. సినీమా అనేది గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఒక్క సారి లక్కు మారిందా పట్టుకోవడం కష్టం. కానీ ఆ లక్కు మొదలయ్యేంత వరకు మాత్రం ఓపికగా ఎదురుచూడాల్సిందే. ఇప్పడు ఇదే పరిస్థితిని ముగ్గురు క్రేజీ హీరోయిన్స్ ఎదుర్కొంటున్నారు. ఇండస్ట్రీలో హీరోలదే పై చేయి.. హీరోయిన్ లు నిలబడాలంటే గ్లామర్ ని ఒలకబోయాల్సిందే.
అలా అని అవకాశాలు రావడం లేదా? అంటే క్రేజీ ఆఫర్లని దక్కించుకుంటున్నారు కానీ అదే స్థాయిలో హిట్ లని మాత్రం ఈ ముగ్గురు సొంత చేసుకోలేకపోతున్నారు. ‘ప్రతిరోజు పండగే’ తరువాత రాశీఖన్నా హిట్ అనే మాట విని దాదాపు మూడేళ్లు కావస్తోంది.
ఈ ఏడాది ‘పక్కా కమర్షియల్’ మూవీతో తన ఫ్లాప్ లకు ఫుల్ స్టాప్ పెట్టేసి బిగ్ బ్యాంగ్ తో మళ్లీ ట్రాక్ లోకి రావాలని భారీ ఆశలు పెట్టుకుంది. కానీ తన అంచనాల్ని తలకిందులు చేస్తూ ‘పక్కా కమర్షియల్’ డిజాస్టర్ అనిపించుకుని షాకిచ్చింది.
ఆ తరువాత నాగచైతన్య తో చేసిన ‘థాంక్యూ’ కూడా బిగ్ డిజాస్టర్ అనిపించుకుంది. ప్రస్తుతం తన హోప్ కార్తి నటిస్తున్న ‘సర్దార్’ పైనే వుంది. ఇక గతేడాది ‘ఉప్పెన’తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని క్రేజీ హీరోయిన్ ల జాబితాలో చేరిన కృతిశెట్టి ఆ తరువాత శ్యామ్ సింగరాయ్ బంగార్రాజు చిత్రాలతో హిట్ లని దక్కించుకుంది. ఆ తరువాతే తన ట్రాక్ పూర్తిగా మారిపోయింది. వరుస డిజాస్టర్లు ఫ్లాపుల్ని దక్కించుకుంటోంది. ది వారియర్ మాచర్ల నియోజక వర్గం ఆ అమ్మాయి గురించి చెప్పాలి వంటి హాట్రిక్ ఫ్లాపులని సొంతం చేసుకుని ఇప్పడు హిట్ మూవీ కోసం నాగచైతన్య – వెంకట్ ప్రభు ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తోంది.
ఈ ఇద్దరి తరువాత అన్ లక్కీ హీరోయిన్ గా మారిన హాటీ కేతిక శర్మ. తను హీరోయిన్ గా పరిచయం అయిన ‘రొమాంటిక్’ ఆశించిన విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది. కానీ కేతిక తన గ్లామర్ తో ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లని దక్కించుకుంది. నాగశౌర్యతో ‘లక్ష్య’ వైష్ణవ్ తేజ్ తో ‘రంగ రంగ వైభవంగ’ వంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచి షాకిచ్చాయి. ప్రస్తుతం తన లక్కుని మార్చే సినిమా కోసం ఎదురు చూస్తోంది. నెక్ట్స్ ప్రాజెక్ట్ లతో అయినా ముగ్గురి లక్కు మారుతుందో చూడాలి.