ఆ రెండు విషయాలపై ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసిన ‘ఆదిపురుష్‌’


పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్‌ లో రాముడిగా ప్రభాస్‌ రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కాని గత కొన్ని నెలలుగా సీత పాత్రలో ఎవరు లక్ష్మణుడిగా ఎవరు కనిపించబోతున్నారు అనే విషయమై సస్పెన్స్ గా ఉంది. కృతి సనన్‌ పేరు వినిపిస్తూ వచ్చింది కాని కన్ఫర్మ్‌ చేయక పోవడంతో పుకార్లే అయ్యి ఉంటాయని అనుకున్నారు. కీర్తి సురేష్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని చివరకు కృతి శెట్టి పేరును కన్ఫర్మ్‌ చేస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఇక లక్ష్మణుడి పాత్రకు గాను బాలీవుడ్‌ యంగ్‌ హీరోల పేర్లు చాలా వినిపించాయి. చివరకు ఈ సినిమాలో లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ను ఎంపిక చేసినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. కృతి సనన్ మరియు సన్నీ సింగ్ తో ప్రభాస్ కలిసి ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్డింగ్‌ లో ఉన్నాయి. ఒక్క ఫొటోతో గత రెండు మూడు నెలలుగా జోరుగా ప్రచారం జరుగుతూ ఎంతో మంది జుట్టు పీక్కునేలా చేసిన రెండు ప్రశ్నలకు సమాధానం లభించింది. ఓం రౌత్ ఈ సినిమా ను ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నాడు. అతి త్వరలోనే షూటింగ్‌ పార్ట్‌ ను ముగించే అవకాశం కూడా కనిపిస్తుంది. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. విజువల్‌ వండర్ గా ఈ సినిమాను చూపించేందుకు దాదాపుగా 350 కోట్ల రూపాయలను విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఖర్చు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.