సౌత్ ఇండియాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోయిన్ గా ఎదిగిన నటి మీనా. మలయాళీ ఇండస్ట్రీలో చైల్డ్ యాక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈమె తరువాత సీతారామయ్యగారి మనవరాలు అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ లో స్టార్ లు అందరితో ఆమె ఆడిపాడింది. ప్రస్తుతం సీనియర్ నటిగా మారిన ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ బిజీగా ఉంది.
ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత బెంగుళూరుకి చెందిన విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తని మీనా పెళ్లి చేసుకుంది. గత ఏడాది అనారోగ్య సమస్యలతో అతను మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఈమె మరల నటిగా ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. రీసెంట్ గా ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఓ తమిళ్ చానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. తనకి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం అని పేర్కొంది. అమ్మావాళ్ళకి కూడా హృతిక్ రోషన్ లాంటి అబ్బాయి అయితే పెళ్లి చేసుకుంటా మా అమ్మకి కూడా చెప్పాను. అయితే హృతిక్ రోషన్ కి పెళ్లి అయినప్పుడు నేను షాక్ అయ్యాను. నిజం చెప్పాలంటే నా గుండె పగిలిపోయింది. అంతగా హృతిక్ రోషన్ ని ఇష్టపడ్డాను అని పేర్కొంది.
ఇక హృతిక్ రోషన్ ని పెళ్లి అయ్యే సమయానికి తనకి పెళ్లి కాలేదు అని మీనా తన మనసులోని మాటని బయటపెట్టింది. ప్రతి హీరోయిన్ కి ఏదో ఒక హీరో అంటే క్రష్ ఉంటుంది. అలాగే మీనాకి కూడా హృతిక్ రోషన్ అంటే క్రష్ అనే విషయాన్ని మొదటి సారిగా బయట పెట్టింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే భర్త చనిపోయిన బాధ నుంచి బయటపడేందుకు ఈ మధ్య మీనా ఎక్కువగా సినిమాలు ఒప్పుకుంటూ బిజీ అవుతున్నట్లు తెలుస్తుంది.