ఆ హిట్ మూవీ శ్రీకాంత్ ఆశలను ఆవిరి చేసిందా?


ప్రముఖ నటుడు శ్రీకాంత్ అంటే తెలియని తెలుగు సినీ ప్రియులు ఉండరు. ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ అనే మూవీ ద్వారా నటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రీకాంత్.. కెరీర్ ఆరంభంలో చిన్నచిన్న విలన్ పాత్రలను పోషించాడు. ఆ తర్వాత తనదైన టాలెంట్ తో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ గా ఎదిగిన అతి కొద్ది మంది హీరోల్లో శ్రీకాంత్ ఒకరు.

ఫ్యామిలీ చిత్రాల హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న శ్రీకాంత్.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సైతం సంపాదించుకున్నాడు. అయితే గత కొన్నేళ్ల నుండి ఈయన కెరీర్ అనుకున్న స్థాయిలో సాగడం లేదు. వరుస పరాజయాల నేపథ్యంలో హీరోగా అవకాశాలు తగ్గాయి. దాంతో శ్రీకాంత్ సహాయక పాత్రలను పోషించడం ప్రారంభించాడు.

ఇలాంటి తరుణంలో నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’లో విలన్ గా నటించే అవకాశం వచ్చింది.

ఈ ఆఫర్ తో శ్రీకాంత్.. ఇకపై విలన్ పాత్రలకే పరిమితం కావాలని భావించారు. ఇందులో భాగంగానే అఖండ చిత్రంపై ఎన్నో ఆశలను పెంచుకున్నాడు. ఈ సినిమా అనంతరం వరుసగా విలన్ పాత్రలు వస్తాయని కూడా శ్రీకాంత్ అనుకున్నాడు.

ఇక అఖండ గత ఏడాది డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టి.. నిర్మాతలకు బయ్యర్లకు మంచి లాభాలను అందించింది. వరుస ఫ్లాపులతో సతమతం అయిన బాలయ్య అఖండతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. కానీ శ్రీకాంత్ ఆశలను మాత్రం ఈ హిట్ మూవీ ఆవిరి చేసింది.

ఎందుకంటే ఈ సినిమాలో శ్రీకాంత్ మెయిన్ విలన్ అంటూ మొదటి నుండీ ప్రచారం జరిగింది. కానీ నితిన్ మెహతా మెయిన్ విలన్ గా నటించాడు. అతడి ముందు శ్రీకాంత్ ది ఒక చిన్న విలన్ పాత్రగా తేలిపోయింది. ఇదే ఆయనకు మైనస్ గా మారింది. దీంతో మళ్లీ ఆయనకు సహాయక పాత్రలే వస్తున్నాయి గానీ.. విలన్ పాత్రలు మాత్రం రావడం లేదట. ఏదేమైనా అఖండ లో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా నటించి ఉంటే మాత్రం ఆయన కెరీర్ మరో విధంగా ఉండేది అనడంలో ఎటువంటి సందేహం లేదు.