బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ హీరోయిన్ ని చూసి ఇష్టపడి పెళ్లి ప్రపోజల్ కూడా పంపించాడట కానీ ఆ హీరోయిన్ తండ్రి అతనికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదని చెప్పాడట. ఇంతకీ ఇది ఎప్పుడు జరిగింది. అసలు ఏంటీ కథ అంటే.. సల్మాన్ ఖాన్ అప్పుడే స్టార్ గా ఎదుగుతున్న రోజుల్లో అప్పుడే ఎంట్రీ ఇచ్చిన జూహీ చావ్లాని చూసి ఇష్టపడ్డాడట. ఆమె వ్యక్తిత్వం నచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట సల్మాన్ ఖాన్ కానీ ఆమె తండ్రి మాత్రం అందుకు నో చెప్పారట. చేసేదేమి లేక సైలెంట్ అయ్యారట సల్మాన్ ఖాన్.
ఒకప్పటి తన ప్రేమ పెళ్లి కథని ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పి సర్ ప్రైజ్ చేశారు సల్మాన్ ఖాన్. ఇండియన్ సెలబ్రిటీస్ లో వెరీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే సల్మాన్ ఖాన్ పేరే వినిపిస్తుంది. 56 ఏళ్ల సల్మాన్ ఖాన్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. అయితే కెరీర్ మొదట్లోనే జూహీ చావ్లా మీద తన ఇష్టాన్ని తెలుపగా ఆమె ఫాదర్ మాత్రం అందుకు నిరాకరించాడట. సో అలా సల్మాన్ ఖాన్ పెళ్లి జరగకుండా ఆగింది.
అయితే ఈ వార్తల పై జూహీ చవ్లా కూడా స్పందించింది. తాను అప్పుడే సినిమాల్లోకి రావడం తో పాటుగా సల్మాన్ కూడా కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నాడు. అందుకే తన తండ్రి అలా చెప్పాడని కవర్ చేసింది. అయితే సల్మాన్ ఖాన్ జుహీ చావ్లా కలిసి 1997లో కలిసి సినిమా చేశారు. కానీ 1995లోనే జూహీ చావ్లాకి బిజినెస్ మెన్ జే మెహతాతో పెళ్లైంది. సో అలా సల్మాన్ ఖాన్ సోలోగానే ఉండిపోయాడు.
సల్మాన్ ఖాన్ పెళ్లిపై వార్తలు రాసి రాసి అసలు సల్మాన్ కి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో అని లైట్ తీసుకున్నారు. ఇప్పటికీ ఫలానా హీరోయిన్ తో సల్మాన్ ఖాన్ డేటింగ్ అంటూ వార్తలు వస్తుంటాయి కానీ భాయ్ మాత్రం పెళ్లి చేసుకోవడంలో మాత్రం ముందడుగు వేయట్లేదు. బ్యాచిలర్ గానే ఉండిపోదామని ఫిక్స్ అయ్యాడు అనుకుంటా అందుకే పెళ్లంటే మాత్రం నోరు విప్పట్లేదు సల్మాన్ ఖాన్.