ఆ హీరోయిన్ పై మనసు పడ్డా కానీ.: సాయి ధరమ్ తేజ్

మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత విరూపాక్షతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఆయన 2021లో రోడ్డు ప్రమాదానికి గురి కావడం ఆ తర్వాత కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. దీంతో సినిమా కాస్త ఆలస్యమౌతూ వచ్చింది. ఆయన కోలుకొని సినిమా పనులన్నీ పూర్తి చేసుకొని విడుదలవ్వడానికి ఇదిగో ఇంత సమయమైంది. ఆలస్యంగా వస్తేనేం మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం హీరోతో పాటు డైరెక్టర్ టేకింగ్ పై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. సాయిధరమ్ తేజ్ డైరెక్టర్ హీరోయిన్ సంయుక్తా మేనన్ అందరూ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ప్రెస్ మీట్స్ ఇచ్చారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన తన క్యూట్ లవ్ స్టోరీ ఒకటి బయటపెట్టారు. తాను ఓ హీరోయిన్ ని ఇష్టపడ్డానంటూ మనసులో మాట చెప్పేశారు. అంతేకాదు.. తాను ఎంత మంది హీరోయిన్లను ఇష్టపడ్డాడో కూడా చెప్పేశాడు.

‘ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. మొదట్లో మేము బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత ప్రేమికులమయ్యాం. డిగ్రీలో ఆ అమ్మాయికి దగ్గరుండి వివాహం చేశాను. ఎందుకంటే అప్పుడు డిగ్రీ తప్ప నా దగ్గర ఏమీ లేదు. అందుకే నా పేమను త్యాగం చేశాను. సమంత ఒక వ్యక్తిగా నన్ను అట్రాక్ చేసింది. కెరీర్ బిగినింగ్ లో నా పక్కన హీరోయిన్స్ గా నటించిన సయామీ ఖేర్ రెజీనా కాసాండ్రా అన్న కూడా చాలా ఇష్టం.’ అని చెప్పాడు.

‘సినిమాల్లోకి వచ్చాక తిక్క మూవీ హీరోయిన్ లారిస్సా బోనేసి ని చూడగానే పడిపోయాను. ఆమెను ప్రేమించాను. ఒకరోజు నువ్వంటే ఇష్టం. డేటింగ్ చేద్దామా అని అడిగాను. సారీ తేజ్ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. ఆమె సమాధానానికి నా గుండె బద్దలైందని… సాయి ధరమ్ చెప్పుకొచ్చారు. ’అలా తన లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పడిందని చెప్పి ఫీలయ్యాడు.

అయితే ఈ వార్త నెట్టింట మాత్రం వైరల్ గా మారింది. గతంలో వీరిద్దరి మధ్య సంథింగ్ ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు తేజ్ కూడా తన లవ్ స్టోరీ ఇలా ఎండ్ అయ్యిందని చెప్పడం అందరినీ షాకింగ్ గురి చేసింది. మెగా కాంపౌండ్ హీరో ప్రపోజ్ చేసినా ఆ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ రోజు విడుదలైన విరూపాక్ష పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. కార్తీక్ దండు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.