ఆ హీరోయిన్ ప్రొఫెషనల్ స్పిరిట్ కి ఫ్యాన్స్ ఫిదా..!

మంగుళూరు బ్యూటీ నేహా శెట్టి ‘డీజే టిల్లు’ మూవీతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టు అందుకుంది. ఈ మూవీలో రాధికగా ఆమె చేసిన పాత్రకు యూత్ మెస్మరైజై ఫ్యాన్స్ గా మారిపోయారు. ఇటీవల కాలంలో నేహా శెట్టి ఎక్కడికెళ్లినా ఫ్యాన్స్ రాధిక.. రాధిక అంటూ కేరింతలు కొడుతూ ఉత్సాహ పరుస్తున్నారు. దీంతో ఈ భామకు టాలీవుడ్ యమ క్రేజ్ ఏర్పడింది.

‘డీజే టిల్లు’ కంటే ముందుగా ఈ భామ తెలుగులో పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాశ్ హీరోగా నటించిన ‘మెహబూబా’ సినిమాలో నటించింది. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ నేహా శెట్టి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో నేహా శెట్టికి తెలుగులో వరుస ఆఫర్లు దక్కాయి.

సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘గల్లీ రౌడీ’.. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే సిద్ధు జోన్నల గడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ ఆఫర్ దక్కించుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ మూవీకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు.

రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. డీజే టిల్లుగా సిద్దు జొన్నల గడ్డ.. రాధికగా నేహా శర్మ అద్భుతంగా నటించారు. ఈ సినిమా మ్యూజికల్ పరంగానూ సూపర్ హిట్టయింది. రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘డీజే టిల్లు’ ఏకంగా 30 కోట్లను రాబట్టింది.

డీజే టిల్లు కథ రీత్య రాధిక పాత్ర జైలుకు వెళ్లగా ఆమెపై సానుభూతితో హీరో బెయిల్ ఇప్పిస్తాడు. అక్కడి నుంచి డీజే టిల్లు సీక్వెల్ ప్రారంభం కానుందని దర్శకుడు విమల్ కృష్ణ హింట్ ఇచ్చాడు. సెకండ్ పార్ట్ లోనూ నేహా శెట్టి హీరోయిన్ కన్పిస్తుందని అంతా భావించారు. అయితే ఆమె సెకండ్ పార్ట్ లో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవలే డీజే టిల్లు సీక్వెల్ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘టిల్లు స్వైర్’గా రాబోతున్న ఈ మూవీలో సిద్దు జొన్నలగడ్డకు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించనుందని చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. నేహా శెట్టి ఈ మూవీలో నటించక పోయినప్పటికీ తన ఇన్ స్టాలో ‘డీజే స్వైర్’ పోస్టర్ ను పోస్ట్ చేసిన చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సినిమాలో తాను భాగం కానందుకు ఆమె ఈ సినిమాను పెద్దగా ప్రమోట్ చేయకుండా ఉండవచ్చు. కానీ నేహా శెట్టి అలా చేయలేదు. తన ప్రొఫెషనిజాన్ని చాటుకొని అందరి మనసులను గెలుచుకుంది. ఆమె చేసిన పనికి అభిమానులు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.