ఇంకా సమంత చేతిలోనే ఆ హాలీవుడ్ మూవీ!

సమంత మయో సైటిస్ సమస్య కారణంగా గత కొన్ని నెలలుగా పూర్తిగా షూటింగ్ లకు దూరంగా ఉంది. ఆ మధ్య యశోద సినిమా కోసం రెండు రోజులు ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కెమెరా ముందుకు వచ్చింది కానీ ఇప్పటి వరకు సమంత ఎక్కడ ఉంది.. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటీ అనే విషయమై మీడియాకు కానీ.. ఇండస్ట్రీ వర్గాల వారికి కాని సమాచారం లేదు.

డిసెంబర్ నుండి ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటాను అంటూ శివ నిర్వాన టీమ్ కు ఆమె హామీ ఇచ్చిందట. కానీ ఇంకా ఆమె షూటింగ్ కు హాజరు అయ్యేందుకు రెడీ అవ్వలేదు. దాంతో మరోసారి రీ షెడ్యూల్ కు విజ్ఞప్తి చేసిందట. డిసెంబర్ లో ఖుషి సినిమా షూట్ పెట్టుకోవాలనుకున్న యూనిట్ సభ్యులు క్యాన్సిల్ చేశారనే వార్తలు వస్తున్నాయి.

కేవలం విజయ్ దేవరకొండ.. శివ నిర్వాన ఖుషి సినిమా మాత్రమే కాకుండా బాలీవుడ్ సినిమాలు మరియు సిరీస్ ఇంకా హాలీవుడ్ సినిమా కూడా సమంత కారణంగా నిలిచి పోయాయి. సమంత నటిస్తున్న మొదటి హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సమంత అనారోగ్య పరిస్థితుల కారణంగా వాయిదా పడిందట.

ఆ మధ్య ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమా నుండి సమంతను తప్పించారని.. ఆమె అనారోగ్యంతో షూటింగ్ కు ఇప్పట్లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు కనుక సమంత చేతి నుండి హాలీవుడ్ మూవీ చేజారింది అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై తాజాగా క్లారిటీ వచ్చింది.

దర్శకుడు ఫిలిప్ జోన్ ఇప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్ లోనే ఉన్నాడు. షూటింగ్ కు వెళ్లేందుకు సమంత కోసం వెయిట్ చేస్తున్నాడట. ఆమె ఒక లెస్బియన్ పాత్రను పోషిస్తున్న విషయం తెల్సిందే. ఆ పాత్రకు ఆమె సూట్ అవుతుందనే ఉద్దేశ్యంతో దర్శకుడు వెయిట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఫిలిప్ జోన్ సినిమా అరేంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ లో వరుణ్ దావన్ తో ఈమె చేయబోతున్న ప్రాజెక్ట్ కూడా ఇంకా ఆమె చేతిలోనే ఉందని.. మరో రెండు మూడు నెలలు అయిన తర్వాత అయినా సమంత మాత్రమే ఆ సినిమాలు మరియు సిరీస్ లు చేయబోతుందని తెలుస్తోంది.