మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకూ ఎన్నో వైవిథ్యమైన పాత్రల్లో మెప్పిచారు. 150కి పైగా సినిమాలు చేసిన గొప్ప నటుడు. ఇండస్ర్టీలో ఆయనో ఎన్ సైక్లో పీడియా. ఎంతో మంది దర్శక..నిర్మాత..రచయితలకు స్పూర్తి. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని పరిశ్రమలో పైకొచ్చిన వారెందరో. నేటి యువతకి మార్గదర్శకులు.
ఇప్పటికీ..ఎప్పటికీ ఆయనెప్పుడు ఆదర్శమే. పరిశ్రమలో రాణించాలనుకునే వారికి ఆయనెప్పుడు సూచనలు..సలహాలు ఇస్తుంటారు. అకుంటిత పట్టదలతో.. మొక్కవోని దీక్షతో …నిరంతరం శ్రమిస్తేనే ఇండస్ర్టీలో సక్సెస్. ఆ లక్షణాలన్ని మీలో ఉంటేనే ఇండస్ర్టీకి రండి. అందులో ఏ ఒక్కటి లోపించినా ఇక్కడ రాణించడం కష్టం..అనవసర శ్రమ..సమయాన్ని వృద్ధాయన్ని వృదా చేసుకోవడమే అంటారు.
ఒక్క రోజు వచ్చే సక్సెస్ కోసం వేల రాత్రుళ్లు ఎదురు చూడాల్సి ఉంటుందంటారు. ఇవన్నీ దాటుకుని వచ్చారు కాబట్టే మెగాస్టార్ అయ్యారు. నేడు చిరంజీవిగా కీర్తింపబడుతున్నారు. తాజాగా చిరు ఓ వేడుకలో యువతకి మరికొన్ని సందేశాలిచ్చారు. యువ ప్రతిభావంతుల్ని మెచ్చుకుంటూ వారు మరింత హైట్స్ కి చేరుకోవాలని ఆకాక్షించారు.
` హీరోలు డేట్లు దొరికాయని తొందరపడి సినిమాలు చేయోద్దు. కథపై పూర్తిగా నమ్మకం కల్గిన తర్వాత సినిమాలు చేయండి. ఆన్ సెట్లో అప్పటికప్పుడు డైలాగులు రాయడం కన్నా…సమయం తీసుకుని రాయండని సూచించారు. అలాగే కథ రాయడం పూర్తయిన తర్వాత ఆ కథతో ప్రేక్షకుల ముందుకు వెళ్తే వంద శాతం సక్సెస్ వస్తుందా ? రాదా? ఆ కథ సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎంతవరకూ ఉన్నాయి వంటి విశయాల్ని విశ్లేషించుకోండి.
మనం తీసిన సినిమా మనకి నచ్చుతుందా? లేదా? అని పునశ్చరణ చేసుకుంటే? లోపాలుంటే తెలుస్తాయి. ఒకవేళ నీకే నచ్చలేదు? అంటే ప్రేక్ష కుడికి ఇంకెలా నచ్చుతుందని నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఇలా ప్రతీ విషయంలో సినిమా చేసే ముందు రివ్యూ చేసుకోవడం ఎంతో మంచిదని వేదికపై ఉన్న యువతని ఉద్దేశించి మాట్లాడారు.
సినిమా విషయంలో తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. మీ సినిమా జీవితాన్ని నిర్దేశించి సక్సెస్ మాత్రమే. ఆ విజయం కోసం ఎంతైనా శ్రమించండి. మహా అయితే ఇం కొన్ని నెలలు సమయం పడుతుంది. మంచి సినిమా చేయడానికి ఆస్కారం ఉంటుందని మెగాస్టార్ యువతకి సూచనలు..సలహాలు ఇచ్చారు. ఇలాంటి క్లాస్ యువతకి మంచిదే. అనుభవజ్ఞులు ఏం చెప్పినా? అందులో తీసుకోవాల్సిన మంచి ఎంతో ఉంటుంది. వాటినే విజయానికి సోపానాలుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం చిరంజీవి మూడు సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ముందుగా దసరా కానుకగా అక్టోబర్ 5 న `గాడ్ ఫాదర్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అటుపై `వాల్తేరు` వీరయ్య తో సంక్రాంతికి రాబోతున్నారు. సమ్మర్ కానుకగా `భోళా శంకర్` ని ప్లాన్ చేస్తున్నారు.