ఇంత టెన్షన్ లో కూడా మాట తప్పని సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడంతో ఆయన మహారాష్ట్ర ప్రభుత్వం మరింతగా భద్రత పెంచింది. కొద్ది రోజుల క్రితం సల్మాన్ ఖాన్ సన్నిహితుడు మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత సిద్ధిఖి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చేతిలో హత్యకు గురయ్యాడు. గతంలో పలుమార్లు ఆ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ చంపేస్తామని హెచ్చరికలు చేశారు. సిద్ధిఖి హత్య తర్వాత సల్మాన్ ఖాన్ కూడా భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు..

ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ కారు కూడా తెప్పించుకుంటున్నారు. ఇదిలా ఉంటే భద్రత పరంగా టెన్షన్ ఉన్న కూడా సల్మాన్ ఖాన్ తన వృత్తి నిర్వహణను మాత్రం విడిచిపెట్టలేదు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో బాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ చిత్రంగా ‘సింగం అగైన్’ తెరకెక్కింది. దీపావళి పండుగ ఈ చిత్రాన్ని నవంబర్ 1న ప్రేక్షకుల మందికి తీసుకొని వస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో చూపించాలని రోహిత్ శెట్టి భావించారు. అజయ్ దేవగన్ కూడా అడగడంతో సల్మాన్ ఖాన్ చేయడానికి ముందుకొచ్చారు.

అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ భద్రత పరమైన ఇబ్బందులలో ఆయన సంబంధించిన గెస్ట్ రోల్ ని తీసేయాలని మేకర్స్ భావించారంట. సల్మాన్ ఖాన్ ను ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని రోహిత్ శెట్టి అజయ్ దేవగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం ఇచ్చిన మాటకి కట్టుబడి తాజాగా ముంబైలో ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆయనపై కీలక యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కించారు.

ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సల్మాన్ ఖాన్ వర్క్ డెడికేషన్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ షో నడుస్తోంది. దానిని కూడా కట్టుదిట్టమైన భద్రత నడుమ సల్మాన్ ఖాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ కూడా ఎలాంటి బెదిరింపులు వచ్చిన తన వృత్తి ధర్మాన్ని మిస్ చేయనని చెప్పారు.

ఇదిలా ఉంటే ‘సింగం అగైన్’ సినిమాలో అజయ్ దేవగన్, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొనే, అర్జున్ కపూర్ నటించారు. రామాయణం ఇతిహాసానికి కాప్ స్టోరీ కనెక్ట్ చేసి తెరపై భారీ యాక్షన్ విజువల్స్ తో రోహిత్ శెట్టి ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. ‘సింగం’ ఫ్రాంచైజ్ లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.