ఇందుకే వెంకీ అంటే ఇష్టపడేది..

టాలీవుడ్ లో అసలు పూర్తిగా నెగిటివ్ కామెంట్స్ చూడని హీరో ఎవరైనా ఉన్నారా అంటే.. అందులో వెంకీ టాప్ లిస్టులో ఉంటారని చెప్పవచ్చు. ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నాడు. ఇక ఎఫ్‍‍‍‍ 3 సినిమా తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న వెంకటేశ్.. వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలోకి దిగనున్నారు. ఇక ప్రమోషన్స్ కోసం వెంకీ ఇప్పుడు నేటితరం యువ హీరోలతో పోటి పడుతున్నాడు.

చిరంజీవి, అక్కినేని నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. ఈ నలుగురు స్టార్స్ ఒక టైమ్ లో పోటాపోటీగా సినిమాలు చేశారు. అయితే వారిలో ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లో అందరూ పాల్గొంటున్నారు కానీ అవి రెగ్యులర్ ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ వరకే పరిమితం అవుతున్నాయి. కానీ వెంకటేష్ మాత్రం నేటితరం యువ హీరోల తరహాలో జనాల్లోకి వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.

దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్ లో నటిస్తున్న సైంధవ్ చిత్రం జనవరి 13న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో బిజీ అయింది మూవీ టీమ్. ప్రమోషన్స్ లో భాగంగా ఏపీలోని విజయవాడ, గుంటూరు పట్టణాల్లో సెకండ్‌ సింగిల్‌ లాంఛ్ ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు VVIT Collegeలో సాయంత్రం 5 గంటలకు KLU Universityలో విద్యార్థుల మధ్య సాంగ్‌ను లాంఛ్ చేయనుంది వెంకీ టీమ్. ఈ నేపథ్యంలో విజయవాడకు పయనమైంది సైంధవ్‌ టీమ్. సోమవారం ఉదయం వెంకీ. విజయవాడలోని ఫేమస్ బాబాయ్ హోటల్ కు వెళ్లారు. అక్కడ ఉన్న ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సీనియర్ స్టార్స్ లలో జనాలకు చాలా దగ్గరగా వెళుతూ ప్రమోషన్స్ చేస్తున్న ఏకైక హీరో వెంకీ అని ఫ్యాన్స్ అంటున్నారు. వెంకీ సో సింప్లిసిటీ అని కామెంట్లు చేస్తున్నారు.

మేకర్స్‌ ఇటీవలే లాంఛ్‌ చేసిన సైంధవ్‌ ఫస్ట్‌ సింగిల్ WrongUsage ట్రాక్‌ మ్యూజిక్ లవర్స్ తెగ ఆకట్టుకుంటోంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌ మిషన్‌ నేపథ్యంలో సాగే సైంధవ్‌లో జెర్సీ ఫేమ్ శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్‌ యాక్టర్‌ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్‌ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ మూవీని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి తెరకెక్కిస్తుండగా సంతోష్‌ నారాయణన్‌ సంగీతమందించారు.