బాహుబలి సినిమా తో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు. తర్వాత అన్నీ ప్యాన్ ఇండియా మూవీసే ఎంచుకుంటున్నారు. ఈ క్రమం లో ఇటీవల ఆయన ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ విడుదల కు ముందు ప్రభాస్ అమెరికా వెళ్లారు.
ఆదిపురుష్ విడుదల తర్వాత ఆయన అమెరికా నుంచి భారత్ కి వస్తాడు అని వార్తలు వచ్చాయి. కానీ మూవీ విడుదలై ఇంతకాలం అవుతున్నా ప్రభాస్ ఇక్కడకు రాలేదు. అయితే ప్రాజెక్ట్ కే ఈ వెంట్ తర్వాత ఇండియా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ చేస్తున్న మరో పెద్ద చిత్రం ప్రాజెక్ట్ కె. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు. వైజయంతి బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీ లో అమితాబ్ దీపికా పదుకొణె దిశా పటానీ కమల్ హాసన్ లాంటి వారు నటిస్తుండటంతో ఈ మూవీ పై చాలా క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ శుక్రవారం బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రాజెక్ట్ కె సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ‘శాన్ డియాగో కామిక్ కాన్’ ఈవెంట్లో పాల్గొననున్నట్లుగా చిత్ర బృదం ప్రకటించింది.
అమెరికా లో జరగనున్న ‘శాన్ డియాగో కామిక్ కాన్’ ఈవెంట్లో ‘ప్రాజెక్ట్ కె’ టీమ్ అంతా పాల్గొననుంది. ఈ ఈవెంట్ కు హాజరు కానున్న తొలి భారతీయ సినిమా గా ప్రాజెక్ట్ కె రికార్డు సృష్టించింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న తర్వాత ప్రభాస్ ఇండియా కు తిరిగి వస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ ఈవెంట్ కి ప్రభాస్ తోపాటు దర్శక నిర్మాతలుదీపిక పదుకునే కమల్ హాసన్ దీనికి హాజరు కానున్నారు. ఇదే వేదిక పై ఈ సినిమా టైటిల్ టీజర్ని విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.