ఇలా క‌న్ప్యూజ్ చేస్తే ఎలా భామ‌లు?

క‌రీనాక‌పూర్ ఖాన్-అలియాభ‌ట్ ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం చాలా ఉంటుంది. ఇద్ద‌రు ఒక త‌రం న‌టులు కాదు. అలియా క‌న్నా క‌రీనా చాలా సీనియ‌ర్. కానీ ఆ బ్యూటీలిద్ద‌రు చాలా క్లోజ్ అని తెలుస్తోంది. ఇద్ద‌రు తొలిసారి ‘ఉడ‌తా పంజాబ్’ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా మంచి విజ‌యం సాధించింది. మ‌ళ్లీ ఆ కాంబినేష‌న్ లో సినిమా రాలేదు. సాధార‌ణంగా హీరోయిన్ల కాంబినేష‌న్స్ అనేవి పెద్ద‌గా సెట్ కావు. చాలా రేర్ గా జ‌రుగుతుంటాయి.

తాజాగా సోష‌ల్ మీడియాలో అలియాభట్-క‌రీనా ఒక ప్రేమ్లో ఉన్న ఫోటో ఒక‌టి వైరల్ అవుతుంది. ఆ ఫోటోని ఉద్దేశించి ‘ఇది మరింత మెరుగుపడుతుందా’? అని అలియా భట్ – కరీనా కపూర్‌తో చెవిలో గుస గుస‌లాడింది. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీంతో వాళ్ల‌సాన్నిహిత్యాన్ని గ‌మ‌నించిన ద‌ర్శ‌క‌-నిర్మాత‌.. ఇద్ద‌రికి కామ‌న్ ప్రెండ్ అయిన కరణ్ జోహార్ “ఈ తారాగణంతో మాకు ఒక చిత్రం కావాలి” అని రాసాడు.

దీనికి నటుడు అర్జున్ కపూర్ ‘పూ స్క్వేర్’ అని రాశారు. ఈ చిత్రాల్ని పంచుకుంటూ ఇలా అలియా ఇలా రాసింది. ‘దయచేసి ఎవరైనా మమ్మల్ని ఓ చిత్రంలో న‌టింప‌జేయాలి? అని కోరింది. ఇలా ఆ ముగ్గ‌రి మ‌ధ్య స‌రదా సంభాష‌ణ జ‌రిగింది. అయితే ఆ ఫోటో ఎప్పుడు దిగింది? ఎక్క‌డ దిగారు? అన్న వివ‌రాలు మాత్రం అలియా భ‌ట్ రివీల్ చేయ‌లేదు. ఈ కామెంట్ల‌పై కొంద‌రు ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు త‌ప్ప‌కుండా ఛాన్స్ ఇస్తామ‌ని కామెంట్లు పోస్ట్ చేసారు.

ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో త్వ‌ర‌లోనే ఓ సినిమా వ‌స్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని అభిమానులు పోస్టులు పెట్టారు. కొంత మంది ఈ ఫోటో ఉడ‌తా పంజాబ్ చిత్రం కంటే ముందు దిగి ఉంటుంద‌ని గెస్ చేస్తున్నారు. లేక‌పోతే అలియాభ్ పాత ఫోటోతో కొత్త కాంబినేష‌న్స్ అడ‌గ‌ద‌ని సందేహిస్తున్నారు. ప్ర‌స్తుతం అలియాభ‌ట్ న‌టిగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. తెలుగు సినిమా అవ‌కాశాలు క్యూలో ఉన్నాయి.