ఎంత పని చేశావ్ వరుణ్.. సాయి తేజ్ ఎటాక్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా లావణ్య త్రిపాఠిని పెళ్లాడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం చాలా ఏళ్లుగా సీక్రెట్ గా ఉంచారు. మెగా కోడలిగా లావణ్య కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. వరుణ్ లావణ్యల రీసెంట్ గానే ఇటలీలో జరిగింది. మెగా ఫ్యామిలీ కొంతమంది సన్నిహితులు పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. అయితే బ్యాచిలర్ లైఫ్ కి ఎండ్ చెప్పి కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న వరుణ్ తేజ్ ని సాయి ధరం తేజ్ సరదాగా ఆటపట్టించాడు.

ఇటలీలో వరుణ్ తేజ్ కారుని ఆపుతూ ఎందుకు ఇంత పని చేశావ్ వరుణ్ అని అన్నాడు. ప్రస్తుతం ఆ ఫోటోలనే తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఎందుకు అంటూ అన్ని భాషల్లో పెట్టి ఇంత పనిచేశావ్ వరుణ్ బాబు అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు మెగా ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. మెగా హీరోల్లో వరుణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ వీరంతా కూడా చాలా క్లోజ్ గా ఉంటారు.

అప్పుడప్పుడు వీరు ఇంట్లో చేసే ఫన్నీ థింగ్స్ ని కూడా షేర్ చేస్తూ ఉంటారు. అయితే తమ బ్యాచిలర్ బ్యాచ్ వదిలేసి పెళ్లి చేసుకుంటున్నందుకు సాయి తేజ్ సరదాగా వరుణ్ ని ఆటపట్టించాడు. సినిమాల పరంగా ఎలా ఉన్నా మెగా హీరోలంతా కూడా కలిసి మెలిసి ఉంటున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ కు రెడీ అవుతుండగా మట్కా అంటూ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

సాయి తేజ్ విషయానికి వస్తే విరూపాక్ష, బ్రో తర్వాత సంపత్ నందితో గాంజా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఫుల్ మాస్ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ పై మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. కొత్తగా పెళ్లైన వారిని పెళ్లి కాని బ్యాచిలర్స్ ఆటపట్టించడం కామనే. ఈ క్రమంలో బావ వరుణ్ తేజ్ ని సాయి తేజ్ ఆడుకున్నాడు. ఎందుకు ఇలా చేశావ్ అంటూ ఇటలీలో పెళ్లి నాటి ఫోటోలను షేర్ చేసి మెగా ఫ్యాన్స్ ని అలరించాడు. వరుణ్ తేజ్ పెళ్లిలో మెగా హీరోల సందడి అదిరిపోయిందని తెలుస్తుంది. చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు అందరు సంగీత్ లో ఆటపాటలు పెళ్లిలో డ్యాన్స్ లు ఇలా పెళ్లి వేడుకని పండుగలా జరుపుకున్నారని తెలుస్తుంది.