ఎక్స్ క్లూజివ్: ‘ఆదిపురుష్‌’ లో అయోధ్య భూమి పూజ సీన్‌?

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓం రౌత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ తో రూపొందబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో పట్టాలెక్కించబోతున్నారు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయినట్లే అంటూ సినీ వర్గాల వారి ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ చాలా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒక వైపు అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతుంటే మరో వైపు ఈ సినిమా తెరకెక్కడం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఆదిపురుష్‌ చిత్రంలో అయోధ్య రామాలయంకు చెందిన సీన్స్‌ కు ఉంటాయేమో అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అయోధ్య రామాలయం భూమి పూజకు సంబంధించిన సీన్‌ ఉన్నట్లయితే ఖచ్చితంగా సినిమాకు మరియు మోడీ ప్రభుత్వంకు చాలా మైలేజ్‌ ఉంటుందని అంటున్నారు. అంగరంగ వైభవంగా ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అయోధ్య భూమి పూజ జరిగింది. ఆ సీన్‌ ను ఆదిపురుష్‌ లో పెట్టే యోచన ఉందని వస్తున్న వార్తలపై యూనిట్‌ సభ్యులు స్పందించాల్సి ఉంది.

ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపిస్తే సీతగా ఎవరు నటిస్తారు, రావణుడి పాత్రలో నటించబోతున్నది ఎవరు అంటూ చాలా ఆసక్తిగా జనాలు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి సినిమా షూటింగ్‌ ప్రారంభం కు ముందే ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. ఆ అనుమానాలకు ప్రశ్నలకు వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత సమాధానాలు లభించే అవకాశం ఉంది.