ఎక్స్ క్లూజివ్: నేడు ప్రారంభం అవ్వాల్సిన ‘ఆచార్య’ షూటింగ్‌ నిలిచిపోయింది

మెగాస్టార్‌ చిరంజీవి.. కొరటాల శివ కాంబోలో రూపొందుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌ నేటి నుండి కొత్త షెడ్యూల్‌ ప్రారంభం అవ్వాల్సి ఉంది. మొదటి నుండి ఎదుర్కొంటున్న సమస్యల మాదిరిగానే మళ్లీ ఈసారి కూడా కోవిడ్‌ టెస్టులు ఆలస్యం వల్ల నేడు ప్రారంభం అవ్వాల్సిన షూటింగ్‌ ఆగిపోయింది. కరోనా నిర్థారణ పరీక్షల విషయంలో రిపోస్ట్ జాప్యం వల్ల నేడు రేపు కాకుండా బుదవారం నుండి షూటింగ్ ను పునః ప్రారంభించాలని కొరటాల భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఆచార్య కోసం చేస్తున్నది యాక్షన్‌ సీన్స్‌. కనుక కరోనా విషయంలో చాలా జగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అందుకే ఆలస్యం అయినా పర్వాలేదు అన్నట్లుగా మెల్లగానే షూటింగ్‌ ను చేస్తున్నారు. భారీ అంచనాలున్న ఆచార్య సినిమాలో హీరోయిన్‌ గా కాజల్‌ నటిస్తుంది. కీలకమైన పాత్రలో స్టార్‌ హీరో రామ్‌ చరణ్‌ కనిపించబోతున్నాడు. చిరు చరణ్‌ లు కలిసి నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందని అంత నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.