మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ దర్శకులలో టాప్ స్థానాన్ని అనుభవిస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వే నువ్వే అనే రొమాంటిక్ కామెడీ చిత్రంతో తన అరంగేట్రం చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమాలో తరుణ్ నటించగా స్రవంతి రవి కిషోర్ నిర్మించాడు. అప్పటి నుండీ ఇద్దరి మధ్య సఖ్యత అలానే కొనసాగుతూ వస్తోంది. అయితే ఆ తర్వాత నుండీ వీరిద్దరూ కలిసి పనిచేయడం అసలు కుదర్లేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరి కాంబినేషన్ కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
స్రవంతి రవి కిషోర్ స్వయంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పనిచేయడానికి ప్రపోజల్ పెట్టాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా తీయమని అడిగినట్లు తెలుస్తోంది. రామ్ గతేడాది ఇస్మార్ట్ శంకర్ తో అద్భుతమైన విజయాన్ని సాధించాడు. ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమాను పూర్తి చేసాడు. తమిళంలో విజయం సాధించిన తడం చిత్రానికి ఇది రీమేక్. రిలీజ్ కు సిద్ధంగా ఉన్నా ఈ సినిమా ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇంకా రిలీజ్ చేయాలని పరిస్థితి.
రామ్ ఇంకా తన తర్వాతి సినిమాకు కమిట్ అవ్వలేదు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మాత్రం ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. అయితే ఆర్ ఆర్ ఆర్ నుండి ఎన్టీఆర్ ఫ్రీ అవ్వడానికి మరో ఎనిమిది నెలలైనా పట్టే అవకాశముండడంతో ఈలోపు త్రివిక్రమ్ శ్రీనివాస్, రామ్ తో సినిమా చేస్తాడా? స్రవంతి రవి కిశోరె ప్రపోజల్ కు ఎస్ చెబుతాడా అన్నది చూడాలి.