2023, జులై 11న విడుదల అయిన ఓపెన్ హైమర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 950 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. కేవలం వంద మిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందిన క్రిస్టోఫర్ నోలన్ యొక్క ఓపెన్ హైమర్ సినిమా జే రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితాన్ని ప్రేక్షకుల కళ్ల ముందు ఉంచింది.
ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ను ఓటీటీ లో ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఒకే స్ట్రీమింగ్ భాగస్వామి కాకుండా దేశ దేశానికి వేరు వేరుగా ఎంపిక చేశారు.
ఇటీవలే పీకాక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో ఓపెన్ హైమర్ సినిమా స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. ఇండియాలో ఈ సినిమాను జియో సినిమా దక్కించుకుంది. మార్చి 21 నుంచి జియో సినిమాలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయవచ్చు అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.
సిలియన్ మర్ఫీ నటించిన ఈ సినిమాలో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అణు బాంబు అభివృద్ది చేసిన ఓపెన్ హైమర్ గురించి చూపించారు. ఈ సినిమా ఎన్నో అంతర్జాతీయ స్థాయి అవార్డులను అందుకుంది. ముఖ్యంగా ఉత్తమ చిత్రంగా గోల్డెన్ గ్లోబ్స్ అవార్డును అందుకుంది. ఇంకా పదుల సంఖ్యల అవార్డులను కూడా ఓపెన్ హైమర్ దక్కించుకుంది.