యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఫ్యామిలీతో కలిసి ప్రత్యేకంగా వెకేషన్ కి వెళ్లిన విషయం తెలిసిందే. భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి అమెరికన్ వీధుల్లో విహరిస్తూ భార్యతో కలిసి రెస్టారెంట్ లలో ఫొటోలకు పోజులిచ్చిన ఎన్టీఆర్ ఆ తరువాత ఫ్యామిలీతో కలిసి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. రాజమౌళి రామ్ చరణ్చ కీరవాణిలతో కలిసి వైఫ్ లక్ష్మీ ప్రణతితో గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు.
అవార్డు ఫంక్షన్ లో వెరైటీ రిపోర్టర్ అడిగిన పలు ప్రశ్నలకు అమెరికన్ యాక్సెంట్ లోనే సమాధానం చెప్పి అదరగొట్టిన ఎన్టీఆర్ హాలీవుడ్ రిపోర్టర్ కు పుట్టిన రోజు ప్రత్యేక గిఫ్ట్ ని అందించి సర్ ప్రైజ్ చేశాడు. అవార్డు వేడుక ముగియడంతో తన యుఎస్ వెకేషన్ ని కూడా ముగించుకుని ఎన్టీఆర్ ఫ్యామిలీతో సహా హైదరాబాద్ వచ్చేశాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు తరువాత శంషాబాద్ విమానాశ్రయంలో ఎన్టీఆర్ కనిపించడంతో ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఎన్టీఆర్ ని చుట్టముట్టారు.
అతి కష్టం మీద భారీ రద్దీ మధ్య ఎన్టీఆర్ ని ఆయన ఫ్యామిలీని వ్యక్తిగత సిబ్బంది సేఫ్ గా కార్లలోకి ఎక్కించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో ఎన్టీఆర్ లైట్ గడ్డం.. బ్లాక్ గాగుల్స్.. బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ ధరించి సాధారణంగా కనిపించాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలు ముగిసిన తరువాత ఆ ఆనందాన్ని హాలీవుడ్ మీడియాతో పంచుకున్న ఎన్టీఆర్ .. ఒక నటుడిగా ఇంకా ఏం కావాలి?..గోల్డెన్ గ్లోబ్ లో మేమూ ఓ భాగమైనందుకు ఆనందంగా వుంది అని తెలిపాడు.
అంతే కాకుండా ప్రేక్షకులు RRR ని ప్రేక్షకులు అంగీకరించడం చాలా పెద్ద అవార్డ్ అని మేము నిజంగా ఆశీర్వదించబడ్డామని ఇప్పడు మేము ఇండియాకు తిరిగి వెళుతున్నందుకు చాలా గర్వంగా వుందని తెలిపాడు. ఇదిలా వుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హైదరాబాద్ తిరిగి రావడంతో అభిమానులు ఎన్టీఆర్ 30వ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భావిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఆలస్యం అవుతున్న ఈ మూవీ త్వరలో ఫార్మల్ పూజని పూర్తి చేసుకుని ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్పీడప్ చేసిన దర్శకుడు కొరటాల శివ త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. తన ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాన్ని టచ్ చేసే కొరటాల శివ ఈ మూవీలో కూడా సరికొత్త పాయింట్ ని చర్చిస్తూ రూపొందించబోతున్నాడట. యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని ఈ మూవీని నిర్మిస్తున్నారు.