ఎన్టీఆర్ ‘వార్ 2’.. సూపర్ అప్డేట్

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘వార్’ కి సీక్వెల్ రూపొందబోతుంది. మొదటి పార్ట్ లో నటించిన హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా వార్ 2 లో నటించబోతున్న విషయం తెల్సిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాని యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా నిర్మించబోతున్నాడు.

ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా కనిపించనుండగా ఎన్టీఆర్ విలన్ పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. ఆ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ రాలేదు. ఇక ఈ సినిమా యొక్క హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో మరియు బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ బిజీ హీరోయిన్ గా దూసుకు పోతున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ ని ‘వార్ 2’ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది. సౌత్ లో కూడా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ కియారా అద్వానీ. ఈమె నటించడం వల్ల పాన్ ఇండియా రేంజ్ లో అదనపు బలం అన్నట్లుగా నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వార్ 2 సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరి నుండి మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు కియారా అద్వానీ ప్రస్తుతం తాను చేస్తున్న తెలుగు సినిమా ‘గేమ్ ఛేంజర్’ ను పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. హిందీ సినిమాలు కూడా ఆమె కమిట్ అయినవి షూటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

మొత్తానికి వార్ 2 లో హృతిక్ రోషన్.. ఎన్టీఆర్ లతో పాటు కియారా అద్వానీ కూడా చేరడంతో దేశవ్యాప్తంగా సినిమాకు మరింత క్రేజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి అయిన తర్వాత కియారా అద్వానీ జోరు మరింతగా పెరిగింది. వరుసగా భారీ ప్రాజెక్ట్ లను దక్కించుకుంటూ దూసుకు పోతుంది.