ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. పుష్ప ది రూల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. ఇంట్రో సాంగ్ కోసం బన్నీ అక్కడ కష్టపడుతున్నాడు. అలా గత కొన్ని రోజులుగా బన్నీ వైజాగ్ లోనే ఉంటున్నాడు.
ఈ సందర్భంగా ఆయన అభిమానుల కోరిక మేరకు ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. అభిమానుల కోసం ఏర్పాటు చేసిన మీట్ కు వచ్చి తన ఫ్యాన్స్ కు కనువిందు చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా అల్లు అర్జున్ తన కోసం వేచి చూస్తున్న వేలాది మంది అభిమానుల కోసం వీలు చేసుకుని మరీ మీట్ కు రావడం పట్ల ఆయన అభిమానులు ఆనందంతో పొంగిపోయారు. ఈ కార్యక్రమంలోనే ఫ్యాన్స్ తో ఫోటో షూట్ కు ప్లాన్ చేసింది బన్నీ టీం. ఈ సందర్భంగా వేదిక పైకి వచ్చిన చాలా మంది ఫ్యాన్స్ తో బన్నీ ఫోటోలు తీయించుకున్నాడు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ వికలాంగ అభిమానిని ఏకంగా రెండు చేతులతో పైకి ఎత్తుకుని మరీ ఫోటోకు ఫోజులిచ్చాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఆ పిక్ కాస్త వైరల్ గా మారింది.
ఈ పిక్ ను సోషల్ మీడియాలో బన్నీ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ ఊరికే అవ్వరని ఇలాంటి వెన్నలాంటి మనసు అభిమానులు అంటే ఇష్టం ప్రేమ ఉంది కాబట్టే అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ అంటారని అందుకే వారి అభిమానులను ఆర్మీ అంటారని కామెంట్లు పెడుతున్నారు.
మరో వైపు ఈ ఫోటో షూట్ కార్యక్రమానికి బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.దీంతో అందరితీ ఫోటోలు దిగడం సాధ్యం కాకపోవడంతో మధ్యలోనే బన్నీ వెళ్లిపోయాడు. అయితే అప్పటికే గంటల కొద్దీ వెయిట్ చేసిన అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. గతంలోనూ ఇలాగే జరిగిందని ఈవెంట్ ను సరిగ్గా ప్లాన్ చేయండంటూ నిర్వాహకులపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.