ఓర్హాన్ అవత్రమణి అలియాస్ ఓర్రీ పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ అందగత్తెలతో స్నేహంగా ఉంటూ నైట్ పార్టీలు చేసుకోవడంలో అతడు స్పెషలిస్ట్. సోషల్ మీడియా సంచలనంగా అందరి కళ్లలో ఉన్నాడు. అయితే ఓర్రీ జీవనోపాధి కోసం ఏం చేస్తాడనేది సస్పెన్స్. ప్రతి ఒక్కరూ అతడి ఉద్యోగం ఏమిటో తెలియక ఆశ్చర్యపోతారు. ఓర్రీ తాను `కాలేయం` అని సెటైర్ వేసాడు. ప్రతిసారీ తనను ఆదాయ వనరుల గురించి తరచుగా అడుగుతారని… అందుకే ఇప్పుడు సమాధానం చెబుతున్నానని డీటెయిల్స్ చెప్పాడు ఓర్రీ.
ఓర్రీ ఇటీవల ఫోర్బ్స్ ఇండియాతో మాట్లాడుతూ తన ప్రాథమిక ఆదాయ వనరుల గురించి వెల్లడించాడు. తాను ఈవెంట్‌లకు హాజరవడం ద్వారా ప్రజలకు ఆనందం తెస్తానని తెలిపాడు. ప్రస్తుతానికి, నా దృష్టి ఆనందం అనే సందేశాన్ని వ్యాపింపజేయడం.. ఇది ఎదుటి వ్యక్తులలో ప్రతిధ్వనిస్తే.. నన్ను నాపనిని కొనసాగించేలా చేస్తుంది. ఇతరులకు, నాకు ఆనందాన్ని కలిగించే ఈవెంట్‌లకు హాజరు కావడానికి నాకు అర్హత ఉంది. నా ప్రదర్శనలు ప్రస్తుతం నా ప్రాథమిక ఆదాయ వనరు“అని చెప్పాడు.
ఇలాంటి కార్యక్రమాలకు హాజరైనందుకు తనకు రూ. 15 నుంచి 30 లక్షల వరకు అందుతుందని ఓర్రీ పేర్కొన్నాడు. ప్రజలు నన్ను పెళ్లిళ్లకు పిలుస్తుంటారు.. వారు నాకు రూ.15 లక్షల నుండి రూ.30 లక్షల మధ్య ఎంతైనా చెల్లించడానికి సంతోషిస్తారు. నేను అతిథిగా కాకుండా స్నేహితుడిగా, వరుడి కోసమో లేదా మరొకరి కోసమో ఈవెంట్ కి హాజరు కావాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి నా అసలు ప్రేక్షకులు నన్ను చాలా ఆనందంలో తేలియాడేలా చేస్తున్నారు.
వారు తమ ఈవెంట్‌లలో నన్ను అక్కడకు తీసుకురావాలని కోరుకుంటున్నారు“అన్నారు. గతంలో ఓర్రీ బిగ్ బాస్ 17లో సల్మాన్ ఖాన్‌కి కేవలం ఫోటోలకు పోజులిస్తే దాదాపు రూ. 20 నుండి రూ. 30 లక్షలు ఇస్తారని చెప్పాడు. “నా ఈ భంగిమతో ఈవెంట్‌లలో ఫోటోలు తీసి వాటిని పోస్ట్ చేయడానికి నాకు డబ్బు వస్తుంది. నేను ఈ ఫోటోల కోసం ఒక రాత్రికి దాదాపు రూ. 20-30 లక్షలు సంపాదిస్తున్నాను“ అని చెప్పాడు. దీనికి సల్మాన్ షాక్ అయ్యాడు.
ఇటీవలి కాఫీ విత్ కరణ్ లో ఓర్రీ కరణ్ జోహార్‌తో తన డిజిటల్ (సోషల్ మీడియాల్లో లేకుండా) మరణాన్ని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పాడు. “మీరు నన్ను స్టిల్ ఫోటోగ్రాఫర్ల వెబ్ పేజీలలో స్క్రీన్‌పై చూసినప్పుడు.. నేను చెబుతున్న కథ అదే. రోజంతా కామెంట్లు చదువుతూ గడిపేస్తాను. “కొన్నాళ్లు అతడి హవా సాగుతుంది .. తర్వాత పడిపోతాడు“ అని అంతా అంటుంటారు. అవును, కీర్తి నా తలపొగరు పెంచుతోంది. అవును నాకు ఇప్పుడు ఇలాంటి వైఖరి సమస్య ఉంది. నేను అందరికంటే మెరుగ్గా ఉన్నానని అనుకుంటున్నాను.. కానీ ఇప్పుడు నా పతనాన్ని నేనే ప్లాన్ చేసుకుంటున్నాను. సమయం ఆసన్నమైంది.. ఏది పెరిగినా తిరిగి తగ్గుతుంది. ప్రకాశవంతమైన నక్షత్రం వేగంగా కాలిపోతుంది“అని అతడు నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు.