‘కనా’ కి ఛాన్స్ ఇచ్చిన లేడీ సూపర్‌ స్టార్‌!

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార తన భర్త విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఒక సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అదే సమయంలో మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తోంది. అందులో ఒకటి నయన్‌ 75వ సినిమా అవ్వడం విశేషం. మొత్తంగా మూడు సినిమాలకు కమిట్ అయ్యి ఇప్పటికే షూటింగ్‌ దశలో ఉన్నాయి.

ఈ మూడు సినిమాలు షూటింగ్‌ దశలో ఉండగానే కొత్త సినిమాకు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఐశ్వర్య రాజేష్‌ తో కనా అనే సినిమాను రూపొందించి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు అరుణ్‌ రాజా కామరాజ్‌ దర్శకత్వంలో నయన్‌ ఒక సినిమా చేయబోతుంది. ఇటీవల ఉదయనిధి స్టాలిన్‌ తో ఒక సినిమాను చేసిన అరుణ్‌ రాజా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలు సొంతం చేసుకున్న ఈ దర్శకుడితో నయనతార వర్క్‌ చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఒక లేడీ ఓరియంటెడ్‌ స్క్రిప్ట్‌ రెడీ అయ్యిందని తెలుస్తోంది.

విభిన్న చిత్రాలు చేసుకుంటూ కెరీర్‌ లో ముందుకు సాగుతున్న అన్నపూరణి సినిమా తో నయన్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫలితం విషయం అటుంచి, ఆ సినిమాలో ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడుతున్నాయి.

నయన్‌ తన నటనతో భారతీయ సినిమాలో తన సదస్సాత్వాన్ని నిరూపించుకుంది. తన కెరీర్‌లో అనేక విజయాలను సాధించిన నయన్‌ ఇంకా ఎన్నో విజయాలను సాధించబోతుందని అందరూ భావిస్తున్నారు.