`కాఫీ విత్ కరణ్ 7` బిగ్ బ్యాంగ్ తో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. కరణ్ జోహార్ ఓటీటీ చాట్ షోలో మొదటి అతిధులుగా అలియా భట్- రణవీర్ సింగ్ లు పాల్గొన్నారు. అంచనాలకు అనుగుణంగా కరణ్ తో పాటు అలియా -రణ్ వీర్ లు తమ వ్యక్తిగత జీవితాల గురించి ఇంతకుముందు ఎన్నడూ వినని నిజాలను దాపరికం లేకుండా వెల్లడించారు. రణబీర్ మాజీల గురించి అలియా మాట్లాడటం మొదలు రణ్ వీర్ తన సుహాగ్రాత్ (మొదటి రేయి)లో సెక్స్ చేయడం.. వ్యానిటీ వ్యాన్ లో రొమాన్స్ వరకు చాలా సంగతులే ముచ్చటించారు. గేజో అని పిలవబడే KJo గురించి ఈ షోలో రివీల్ చేస్తూ కాఫీ విత్ కరణ్ 7 మసాలా దట్టించారు. మొదటి ఎపిసోడ్ లోని ఊహించని ఎన్నో విషయాలు వీక్షకులను షాక్ కి గురి చేసాయి.
రణవీర్ తన సెక్స్ లైఫ్ గురించి చాలా నిజాయితీగా ఒప్పుకున్నాడు. బింగో గేమ్ సమయంలో రణ్ వీర్ తన సుహాగ్రాత్ (మొదటి రేయి)లో సెక్స్ చేశానని.. తన వ్యానిటీ వ్యాన్ లో స్పీడయిపోయానని.. రకరకాలుగా సెక్స్ కోసం విభిన్న ప్లేలిస్ట్ లను ఎంపిక చేసానని వెల్లడించాడు. “తాను చాలా అలసిపోయానని సుహాగ్రాత్ అంటూ ఏమీ లేదు“ అని అలియా చెప్పగా దానికి భిన్నంగా రణబీర్ చాలా సంగతులు చెప్పాడు.
కరణ్ జోహార్ తనను గే-జో అని పిలవడం దూషించడంపై ఆవేదన వ్యక్తం చేసాడు. కరణ్ 2 సంవత్సరాల తర్వాత కాఫీ విత్ కరణ్ తో తిరిగి రీలాంచ్ అవుతూ తన హృదయాన్ని ఆవిష్కరించాడు. నేను చాలా కష్టాలు పడ్డాను.. ఇది అంత తేలికైన టైమ్ కాదు… ఆ సమయంలో కాఫీ విత్ కరణ్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ పాము ఎమోజీలు బయటకు వచ్చేవి. ఒక సమయంలో నాపైనా నా షో పైనా చాలా దాడి జరిగినందున నేను తిరిగి కొత్త సీజన్ తో రాలేనని కూడా అనుకున్నాను. నాకు తెలియదు కానీ KJoతో పాము ఎమోజి ఉంది.
వారు నన్ను గే-జో అని పిలుస్తారు లేదా పాము బయటకు వస్తుంది. ఎందుకో కూడా నాకు తెలియదు. నాలో ఏ భాగం పాములా అనిపిస్తుందో నాకు అస్సలు తెలియదు. “నేను ఒకరికి దూరంగా ఉన్నానని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. వాస్తవానికి నేను వారికి భయపడుతున్నాను“ అని అతను చెప్పాడు. నెటిజనుల ట్రోలింగ్ ని తప్పుపడుతూ.. రణ్ వీర్ అతనికి మద్దతుగా నిలిచాడు. ట్రోల్స్ పై విరుచుకుపడ్డాడు. ట్రోలర్లు కరణ్ ను ఒంటరిగా వదిలేయండి అని అన్నాడు.
రాపిడ్ ఫైర్ రౌండ్ సమయంలో మీ బాయ్ ఫ్రెండ్ మాజీలతో ఎలా స్నేహం చేయాలి? అని అలియాను అడిగినప్పుడు ఆమె బదులిస్తూ.. నేను అతని మాజీలకు చాలా మంచి స్నేహితురాలిని.. నేను వారిద్దరినీ ప్రేమిస్తున్నాను. ఇతరులు ఉన్నారు.. కానీ ఎవరో నాకు తెలియదు.. అని ఆలియా అంది.
రణబీర్ కపూర్ పెళ్లి ప్రపోజల్స్ గురించి ఎలా ఆశ్చర్యపరిచాడో ఆలియా భట్ వెల్లడించింది. పెళ్లి తర్వాత రెడ్ ఎమోజీతో భర్త రణ్ బీర్ నంబర్ ను సేవ్ చేసిందిట ఆలియా. ఆమె డైమండ్ రింగ్ `మిసెస్ హిప్ స్టర్` అని పిలుచుకునే వారి రిలేషన్ ఫిలాసఫీతో చెక్కారు. హృతిక్ రోషన్- కార్తీక్ ఆర్యన్- అమీర్ ఖాన్- అజయ్ దేవగన్- వరుణ్ ధావన్ వంటి బాలీవుడ్ స్టార్లను అనుకరిస్తూ రణ్ వీర్ ఎంతో ఎనర్జిటిక్ గా ఈ షోలో కనిపించాడు.