మిల్కీవైట్ బ్యూటీ తమన్నా వేవ్స్ హిందీ పరిశ్రమ లోను విస్తరిస్తున్నాయి. ఓవైపు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం వ్యవహారం పై చర్చ సాగుతుండగానే ప్రముఖ బాలీవుడ్ దర్శకులతో సినిమాల ను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
తాజాగా ముంబై మీడియా అందించిన సమాచారం మేరకు.. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా తొందర్లోనే కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తో కలిసి పని చేసేందుకు ఆస్కారం ఉందని తెలిసింది. ఇటీవల తమన్నా జుహూ లోని దర్శకనిర్మాత భన్సాలీ కార్యాలయం వెలుపల కనిపించడంతో రకరకాల ఊహాగానాలు తెరపైకొచ్చాయి. ఆ ఇరువురి అరుదైన కలయిక గురించి పుకార్లకు ఇది దారితీసింది.
ఈ కలయికలో సినిమా పై ఎటువంటి అధికారిక నిర్ధారణ లేదా తిరస్కరణ లేకపోవడంతో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం ఆ ఇద్దరూ కలుస్తారని ఊహాగానాలు సాగుతున్నాయి. భన్సాలీ ప్రస్తుతం తన వెబ్ సిరీస్ హీరామాండి చిత్రీకరణను ముగించి ఆపై రణవీర్ సింగ్ తో ‘బైజు బావ్రా’ చిత్రీకరణకు వెళతారు.
తదుపరి ప్రాజెక్ట్ గురించి భన్సాలీ ఇంకా ప్రకటించాల్సి ఉంటుంది. ఇక తమన్నా రెండు పడవల ప్రయాణం లో సక్సెసవుతుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఓవైపు సౌత్ మరో వైపు హిందీ చలన చిత్రసీమల్లో వరుస అవకాశాలతో షాకిస్తోంది ఈ బ్యూటీ. తమన్నా సౌత్ లోను వరుస చిత్రాలతో బిజీ గా ఉంది.
ఓవైపు మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ లో నటించిన తమన్నా అటు తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన జైలర్ చిత్రం లో నటించింది. ఈ రెండు చిత్రాలు త్వరలో విడుదల కు సిద్ధమవుతుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంత లోనే కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో తమన్నా భేటీ పై ఆసక్తి మొదలైంది.