కాంట్రవర్సీ తర్వాత రేటు పెంచేసిన సీనియర్ నటి..?


సీనియర్ నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కన్నడలో సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె.. తెలుగు తమిళ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించింది. తల్లి లేదా అత్త పాత్రల్లో నటిస్తూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ గా మారిపోయింది. అయితే ఇటీవల కాలంలో పవిత్ర సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ వార్తల్లో నిలుస్తోంది.

పవిత్ర లోకేష్ గత కొంతకాలంగా సీనియర్ నటుడు వీకే నరేష్ తో సహజీవనం చేస్తోందనే వార్తలు ఈ మధ్య తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ సినిమాల్లో కలిసి నటించడమే కాదు.. ఎక్కడికెళ్లినా జంటగా వెళ్తుందటంతో వీరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తోందంటూ రూమర్స్ ఊపందుకున్నాయి.

గత కొన్ని నెలలుగా సీనియర్ నటీనటుల బంధం గురించి వార్తలు వస్తున్నాయి కానీ.. అటు వీకే నరేష్ గానీ ఇటు పవిత్ర గానీ ఈ విషయం పై ఎన్నడూ స్పందించలేదు. అయితే ఇటీవల ఇద్దరూ కలిసి ఓ స్వామీజీని కలవడంతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా కోడై కూసింది. ఈ క్రమంలో సీన్ లోకి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంటర్ అవ్వడంతో ఇది వివాదంగా మారింది.

రమ్య బెంగళూరులో మీడియాతో నరేష్ పవిత్ర బంధం గురించి మాట్లాడింది. తనకు విడాకులు ఇవ్వకుండానే నాలుగో పెళ్లికి సిద్దమవుతున్నాడని ఆరోపణలు చేసింది. వీటిని నరేష్ ఖండించడం.. పవిత్ర ఓ వీడియో రిలీజ్ చేస్తూ తమకు సపోర్ట్ గా ఉండాలని కోరడం.. నరేష్ – పవిత్ర ఇద్దరూ మైసూర్ లో ఒకే హోటల్ లో కనిపించడం.. ఇలా కొన్ని రోజులపాటు ఈ వివాదమే మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. వీరి గురించే చర్చలు జరిగాయి.

ఈ వ్యవహారమంతా పవిత్ర లోకేష్ కు బాగానే ప్లస్ అయినట్లు తెలుస్తోంది. కాంట్రవర్సీ తర్వాత ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయినట్లుగా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సీనియర్ నటికి రోజు వారీ కాల్షిట్ ప్రకారం మంచి పారితోషకమే ఇస్తుంటారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి తన రెమ్యునరేషన్ ను పెంచేసినట్లుగా రూమర్లు వస్తున్నాయి.

దీంతో వివాదం కారణంగా అటెన్షన్ వచ్చిన తర్వాత పవిత్రా లోకేష్ తన క్రేజ్ మరియు డిమాండ్ ను క్యాష్ చేసుకొంటున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాంట్రవర్సీ తర్వాత వీకే నరేష్ – పవిత్ర ఇద్దరూ ఇటీవల రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో కనిపించారు.

వీరి కాంబినేషన్లో ఉన్న సీన్లకు ఆడియన్స్ నుంచి అనూహ్య రెస్పాన్స్ వచ్చింది. వీరు స్క్రీన్ పై కనిపించినప్పుడు హీరోల రేంజ్ లో థియేటర్లో కేకలు అరుపులతో రచ్చ రచ్చ చేశారు. దీన్ని బట్టి ఈ వివాదం ఏదొక విధంగా పవిత్ర కు క్రేజ్ తెచ్చిపెట్టిందనేది స్పష్టమవుతుంది.