కాంతార హీరోతో శ్రీవల్లి లొల్లి మళ్లీ షురూ!

రీసెంట్ గా పాన్ ఇండియా వైడ్ గా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న మూవీ ‘కాంతార’. ఈ సినిమాతో కన్నడ నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి దేశ వ్యాప్తంగా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. భూతకోల నేపథ్యంలో పీరియాడిక్ ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ. 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ పండితుల్నే విస్మయానికి గురిచేసింది.

ఇదిలా వుంటే ఈ మూవీతో పాపులారిటీని దక్కించుకున్న రిషబ్ శెట్టి కారణంగా నేషనల్ క్రష్ రషమిక మందన్న తరచూ వార్తలలో నిలుస్తూ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ టైమ్ లో రష్మిక ని చాలా మంది నెటిజన్ లు ట్రోల్ కి గురి చేసిన విషయం తెలిసిందే. కన్నడ సినిమా అయిన ‘కాంతార’ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే ఆ మూవీని ఇంత వరకు ఎందుకు చూడలేదంటూ కొంత మంది నెటిజన్ లు రష్మిక ని టార్గెట్ చేయడం.. ఆ తరువాత రష్మిక దానికి వివరణ ఇవ్వడం తెలిసిందే.

ఈ వివాదం ముగిసిపోయినా ఎవరో ఒకరు మళ్లీ దీన్ని రిపీట్ చేస్తూ రష్మిక ని ట్రోల్ చేస్తూనే వున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై మరోసారి స్పందించిన రష్మిక మందన్న ఇండైరెక్ట్ గా రిషబ్ శెట్టిపై కౌంటర్ వేసిందని తెలిసింది. గత కొంత కాలంగా కన్నడ ఫ్యాన్స్ రష్మిక ని ట్రోల్ చేస్తూ దారుణంగా కామెంట్ లు పెడుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా రష్మికని బ్యాన్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన రష్మిక ఆసక్తకర వ్యాఖ్యలు చేసింది.

హీరోయిన్ అయినంత మాత్రాన అందరూ ఇష్టపడతారా? ఇక్కడ కూడా ద్వేషం వుంటుంది. అలాగే ప్రేమ కూడా వుంటుంది. నేను ఓ పబ్లిక్ సెలబ్రిటీని. మనం వారితోనే ఉంటాం.. వారితోనే మాట్లాడుతుంటాం. ఇండస్ట్రీలో కొందరికి నా తీరు నచ్చి ఉండకపోవచ్చు. నేను మాట్లాడే మాటలు నా ఎక్స్ ప్రెషన్స్ చేతులతో చేసే సంజ్ఞలు నచ్చి వుండకపోవచ్చు.

ఎవరి కారణాలు వారికి వుంటాయి. కానీ కొందరికి నేనంటే ప్రేమ వుంటుంది కదా? అలాంటి వారికి నేను కృతజ్ఞురాలిని’ అంటూ ఇండైరెక్ట్ గా రిషబ్ శెట్టికి కౌంటర్ ఇచ్చింది. దీంతో రిషబ్ శెట్టి తో శ్రీవల్లి లొల్లి మళ్లీ షురూ అంటూ కామెంట్ లు మొదలయ్యాయి. మరి దీనిపై రిషబ్ అతని ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.