టాలీవుడ్ లో ఇప్పుడా భామలిద్దరి పరిస్థితి ఏం బాలేదా? అవకాశాల కోసం ఇతర పరిశ్రమలపై ఆధారప డాల్సి వస్తోందా? ఆ భామలు సైతం అక్కడే దృష్టి పెట్టారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇంతకీ ఎవరా? ఇద్దరు భామలు అంటే? వివరాల్లోకి వెళ్లాల్సిందే. మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్ భారీ ఆశలతో టాలీవుడ్ లో కి అడుగు పెట్టింది. అవకాశాలు బాగానే వరించాయి. ‘మహానటి’ లాంటి సినిమా ఆమెకి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. కానీ అమ్మడి కెరీర్ ఆ తర్వాత అనుకున్నంత వేగం పుంజుకోలేదు.
తాను ఒకటనుకుంటే? సన్నివేశం మరోలా కనిపించింది. ఆ సినిమా తర్వాత స్టార్ హీరోలతో అవకాశాలు అందుకోవడానికి చాలా సాహసాలే చేసింది. అలా చేయగా చేయగా చివరికి సూపర్ స్టార్ మహేష్ తో ‘సర్కారు వారి పాట’లో నటించింది.
ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. ఈ సమయంలో గ్లామర్ పాత్రల్లోనూ నటించడానికి సై అనేసింది. అవకాశాలు రాకపోయేసరికి రూల్స్ అన్నింటిని పక్కనబెట్టేసి కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. అయినా సరే టాలీవుడ్ నో వే అనేసింది.
ఇప్పటికీ కీర్తికి సరైన అవకాశాలు రాలేదు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘భోళాశంకర్’ లో ఆయనకు చెల్లి పాత్ర పోషిస్తుంది. అన్నా-చెల్లి సెంటిమెంట్ స్టోరీ అయినా? స్టార్ హీరోకి చెల్లి పాత్రకి పడిపోయిందంటే? మార్కెట్ లో డిమాండ్ పడిపోయినట్లుగానే ట్రేడ్ భావిస్తుంది. ప్రస్తుతం ఆ ఒక్క ఛాన్స్ మినహా కొత్త అవకాశాలేవి లేదు.
ఇక ‘ఉప్పెన’తో దూసుకొచ్చిన హాట్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో నెంబర్ వన్ అవుతుందని అంతా అంచనా వేసారు. కానీ ఆ లెక్కలు తప్పాయి. వరుస వైఫల్యాలు అమ్మడిని రేసులో వెనక్కి నెట్టాయి. టైర్ 2 హీరోలతో కొన్ని సినిమాలు చేయడానికే సాహసించాల్సి వచ్చింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో టైర్ వన్ హీరోలతో ఛాన్స్ అంటే అంత ఈజీ కాదు. జాన్వీ కపూర్..దీపికా పదుకొణే..అలియా భట్ …కియారా లాంటి భామలు పోటీని తట్టుకుని టాలీవుడ్ లో దూసుకురావడంతో! కష్టమనే తెలుస్తుంది.
దీంతో ఇద్దరు భామలిప్పుడు తమిళ..మలయాళ..కన్నడ భాషలపై దృష్టిపెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మాలీవుడ్ లో ఓ సినిమా చేస్తుంది కృతి. కొన్ని చిత్రాలకు సైన్ చేయాల్సి ఉంది. అలాగే కీర్తి ఏకంగా ఐదారు తమిళ సినిమాలు చేస్తుంది. ఈ సంకేతాలే ఆ భామలిద్దర్నీ టాలీవుడ్ కి దూరం చేస్తున్నాయా? అన్న సందేహాన్ని బలపరుస్తున్నాయి.