సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రానున్న పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్లు వస్తున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ చిత్రం సంగీతం పనులు ఇంకా మొదలవలేదని తెలుస్తోంది.
ఈ మేరకు కీరవాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఆ సినిమా గురించి తెలుసుకోవాలంటే రాజమౌళి కి ఫోన్ చేసి అడగాలి. తనకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వస్తుంది (నవ్వుతూ) అంటే వర్క్ ఇంకా నా వరకూ రాలేదని అర్థం. అంటే ఆ సినిమాకి సంబంధించి మ్యూజిక్ పనులు ఇంకా మొదలవలేదని తెలుస్తోంది. జక్కన్న ప్రతి పనిలోనూ కల్పించుకుంటారు. ప్రస్తుతం స్టోరీకి సంబంధించిన పనుల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
ఆయన ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందంటే? ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఆ కథ పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేరు. ఏ సినిమా గురించి కూడా కామెంట్లు పెట్టింది లేదు. స్టోరీ పనులు ముగించి ఆ తర్వాత కీరవాణి దగ్గరకు వస్తారు. అటుపై నటీనటులు ఇతర విషయాలపై దృష్టి పెడతారని తెలుస్తోంది.” అని తెలిపారు.
ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు ఒకేసారి మొదలవ్వాలని భావించిన రాజమౌళి, కీరవాణిని ముందుగానే సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే, స్టోరీ పనులు పూర్తికాకుండా మ్యూజిక్ పనులు మొదలెట్టకూడదని రాజమౌళి భావించినట్లు తెలుస్తోంది.