కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి..

భారత స్టాక్ మార్కెట్లు పెట్టుబడిదారులకు కన్నీరు మిగిల్చింది. ఆరంభంలో ఈరోజు నష్టాలతో మొదలైన మార్కెట్లు సాయంత్రానికి మరింత క్షీణించాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో దేశఈయ మార్కెట్లు కుప్పకూలాయి. ఈక్రమంలోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనమైంది. బెంచ్ మార్క్ సూచీలు సైతం కిందామీదపడ్డాయి. ఉదయం పతనానికి హెచ్.డీ.ఎఫ్.సీ రెండు కంపెనీలు ప్రధాన కారణంగా నిలిచాయి.

ఇంట్రాడే ట్రేడ్ లో బెంచ్ మార్క్ లు అనేక పాయింట్లు క్రాష్ అయ్యి.. పెట్టుబడిదారులకు దాదాపు రూ.4 లక్షల కోట్ల మేర నష్టాన్ని కలిగించాయి. బీఎస్.ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా రూ.277.58 లక్షల కోట్లకు పడిపోయింది. అలా మార్కెట్లు వారాంతంలో పెట్టుబడిదారులను నిండా ముంచాయి. వారిని దెబ్బకు పేదలుగా మార్చేశాయి.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ 1020 పాయింట్లు నష్టంతో ముగిసింది. నిఫ్టీ సూచీ 302 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 1084 పాయింట్లు నిఫ్టీ మిండ్ క్యాప్ సూచీ 747 పాయింట్లను నష్టపోయాయి.

దీనికి ప్రధాన కారణం అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ప్రకటన.. ఈ ప్రకటన తర్వాతనే రిజర్వ్ బ్యాంక్ త్వరలో రేట్లను పెంచనున్న తరుణంలో దేశీయ ఇన్వెస్టర్లు ఆందోళనలో ఉన్నారు.

అందుకే బ్యాంకింగ్ స్టాక్స్ ఎక్కువగా నష్టపోయాయి. పవర్ గ్రిడ్ హిందాల్కో అపోలో హాస్పిటల్స్ అదానీ పోర్ట్స్ ఎన్టీపీసీ యూపీఎల్ ఎస్బీఐఎన్ బజాజ్ ఫిన్ సర్వ్ మహీంద్రా ఇండస్ ఇండ్ టాటా యాక్సిస్ బ్యాంక్ తోపాటు మరిన్ని కంపెనీల షేర్లు భారీ నష్టాలను చవిచూసి చివరికి టాప్ లూజర్స్ జాబితాలో ముగిశాయి.

ఇక ఈ ఒడిదొడుకుల్లో లాభాల బాట పట్టినవి కూడా ఉన్నాయి. ‘దివీస్ ల్యాబ్ సన్ ఫార్మా సిప్లా టాటా స్టీల్ ఐటీసీ కంపెనీలు లాభాల్లో ముగిసి అత్యధిక లాభాలు పొందిన సంస్థలుగా నిలిచాయి.