సుహానాఖాన్ తెరంగేట్రం కోసం తండ్రి షారుక్ ఖాన్ ఎంతగా శ్రమిస్తున్నాడో చెప్పాల్సిన పనిలేదు. అన్ని పనులు తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. స్టోరీ, నటీనటులు, టెక్నీషియన్లు ఇలా సినిమాకి అవసరమైన వారందర్నీ తానే దగ్గరుండి ఎంపిక చేస్తున్నారు. చివరికి తన స్టార్ డమ్ ని సైతం పక్కనబెట్టి కుమార్తె కోసం ఈ సినిమాలో తాను ఓ భాగమవుతున్నారు. ఇప్పటికే దర్శకుడిగా సుజోయ్ ఘోష్ ని ఫైనల్ చేసారు.
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ని విలన్ గా తీసుకున్నారు. ఇంత వరకూ అభిషేక్ బచ్చన్ ఏ సినిమాలో విలన్ గా నటించలేదు. తొలిసారి షారుక్ ఖాన్ కోరడంతో? మాట కాదనలేక విలన్ అవతారం ఎత్తుతున్నాడు. మరో కీలక పాత్ర కోసం ముంజ్యా ఫేమ్ అభయ్ వర్మ ఎంపికయ్యాడు. మ్యూజిక్ సంచలనం అనిరుద్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారు. ఇవన్నీ షారుక్ ఖాన్ చేతుల మీదగా జరిగినవే. ఇక ఇదే సినిమాలో షారుక్ నటిస్తున్నాడు.
ఇప్పటికే అతడు కుమార్తెకు గురువు పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత కేవలం గెస్ట్ రోల్ మాత్రమే పోషిస్తున్నాడన్నారు. తాజాగా ఆ రెండు పాత్రలు కాక సినిమాలో హంతకుడి పాత్రలో కనిపిస్తాడు? అని కొత్త ప్రచారం మొదలైంది. హంతకుడు అంటే మర్డర్ చేసిన తర్వాత మళ్లీ కనిపించకపోవడం కాదు. సినిమా మొత్తం ఆ పాత్ర ఉంటుందని…అవసరమైన అన్ని సన్నివేశాల్లో ఆ పాత్ర ఉంటుందని అంటున్నారు.
మరి సల్మాన్ ఖాన్ గురువా? అతిధా? విలనా? హంతకుడా? అన్నది నిర్దారణ కావాల్సి ఉంది. జనవరి 2025లో సెట్స్‌పైకి వెళ్లుందీ చిత్రం. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
https://www.tupaki.com/entertainment/shah-rukh-khan-suhana-film-1390165