కూతురితో షారుక్ సిల్వర్ స్క్రీన్ ప్లాన్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ జోయా అక్తర్ తెరకెక్కించిన ‘ఆర్చీస్’ మూవీతో తెరంగేట్రం చేస్తోంది. థియేటర్స్ లో కాకుండా ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీల్ డిసెంబర్ 7న విడుదల కానుంది. ఆర్చీస్ రిలీజ్ కి రెడీ అవుతుండగా ఓ యాక్షన్ మూవీలో తన తండ్రితో కలిసి బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వబోతోంది సుహానా. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కునున్న ఈ చిత్రానికి ‘కింగ్’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.

‘వార్’, ‘పఠాన్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్టు నిర్మిస్తుండగా, సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. షారుక్ సొంత ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈ ప్రాజెక్ట్ ని సిద్ధార్థ ఆనంద్ మార్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి నిర్మిస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం..

ఈ సినిమాలోని యాక్షన్ ఫ్లేవర్ ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల్లో షారుక్ చేసిన దానికంటే మరింత భిన్నంగా ఉంటుందట. భారీ చేజింగ్ సీక్వెన్స్ లతో పాటూ ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇవన్నీ ఓ ఎమోషనల్ స్టోరీ తో లింక్ అయి ఉంటాయట. ఇక ఈ మూవీలో తండ్రి, కూతుళ్లు షారుక్, సుహానా కలిసి బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారనే విషయం తెలిసి ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలోని యాక్షన్ ఫ్లేవర్ ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాల్లో షారుక్ చేసిన దానికంటే మరింత భిన్నంగా ఉంటుందట. భారీ చేజింగ్ సీక్వెన్స్ లతో పాటూ ఊహించని ట్విస్టులతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇవన్నీ ఓ ఎమోషనల్ స్టోరీ తో లింక్ అయి ఉంటాయట. ఇక ఈ మూవీలో తండ్రి, కూతుళ్లు షారుక్, సుహానా కలిసి బిగ్ స్క్రీన్ పై సందడి చేయబోతున్నారనే
విషయం తెలిసి ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ప్రస్తుతం సుహానా ఖాన్ తన అప్ కమింగ్ మూవీ ‘ఆర్చీస్’ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. జోయా అక్తర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ వచ్చే నెలలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుహానా ఖాన్ తో పాటు జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ లెజెండ్ యాక్టర్ అమితాబచ్చన్ మనవడు అగస్త్య నందా ఆనంద ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక షారుక్ విషయానికొస్తే, ఈ ఏడాది పఠాన్, జవాన్ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రెండు వేల కోట్లు కొల్లగొట్టి భారీ విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ‘డంకీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న షారుక్ డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.

https://www.tupaki.com/entertainment/sharukscreenshareindaughter-1326941