క్రాక్ ఆల్బమ్ అదిరిపోతుందంటున్నారు!

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ప్లాపుల ఊబిలో కూరుకుపోయిన విషయం తెల్సిందే. రవితేజ నటించిన వరస నాలుగు సినిమాలు ప్లాపులుగా మిగిలాయి. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ కెరీర్ లో హిట్ అన్న మాట ఎరుగలేదు. రీసెంట్ గా రవితేజ కెరీర్ లో వచ్చిన డిస్కో రాజా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్న మాస్ రాజా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈపాటికి క్రాక్ విడుదలకు దగ్గరయ్యేది. అయితే షూటింగ్స్ 40 రోజుల నుండి వాయిదా పడడంతో క్రాక్ ఇంకా అధిక భాగం చిత్రీకరించాల్సి ఉంది.

అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడైన ఎస్ ఎస్ థమన్ తన పని తాను చేసుకుని వెళ్ళిపోతున్నాడట. ఈ సినిమా సాంగ్స్ రికార్డింగ్ కు మెరుగులు దిద్దడంతో పాటు ఇప్పటిదాకా షూటింగ్ జరిగిన సీన్స్ కు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను థమన్ వర్కౌట్ చేస్తున్నాడట. థమన్ చెప్తున్నదాని ప్రకారం క్రాక్ ఆల్బమ్ అదిరిపోతోంది అంటున్నాడు.

ఇటీవలే అల వైకుంఠపురములో ఆల్బమ్ తో థమన్ సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. డిస్కో రాజాతో కూడా పర్వాలేదనిపించిన థమన్ రవితేజకు మరోసారి బెస్ట్ ఔట్పుట్ ఇస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. రవితేజ క్రాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా శృతి హాసన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ క్రాక్ లో కీలకమైన పార్ట్ పోషిస్తోందని చెబుతున్నారు.