క్రికెటర్ కి ‘ఎక్స్‌’ పెళ్లి ప్రపోజల్ పెట్టిన హీరోయిన్‌

తెలుగు బుల్లితెర మరియు వెండి తెర ప్రేక్షకులకు యాంకర్ సుమ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. గత రెండు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంది. రియాలిటీ షో లు, ప్రీ రిలీజ్ వేడుకలు, ఇంటర్వ్యూ లు ఇలా ఏ కార్యక్రమం చేసినా కూడా సుమ చేస్తే చాలా స్పెషల్‌ అన్నట్లుగా ఒక అభిప్రాయం ఏర్పడింది.

అలాంటి సుమ తన తాతకు సంబంధించిన ఒక విషయాన్ని తెలియజేసి అందరి దృష్టిని ఆకర్షించింది. సుమ మలయాళీ అనే విషయం తెల్సిందే. సుమ అమ్మమ్మ యొక్క బ్రదర్‌ బాలసుబ్రమణ్యన్‌ మీనన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆయన దక్కించుకున్న గిన్నీస్ రికార్డ్‌ తో సుమ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

సుమ ఇన్‌ స్టా ద్వారా… మా అమ్మమ్మ గారి బ్రదర్‌ బాలసుబ్రమణ్యన్‌ మీనన్‌ 98 ఏళ్ల వయసు లో గిన్నీస్ రికార్డ్‌ ను అందుకున్నారు. 73 ఏళ్లుగా అడ్వకేట్ గా వర్క్ చేస్తున్న ఆయనకు లాంగ్‌ కెరీర్ కంప్లీట్ చేసుకున్న ఏకైక లాయర్ గా వరల్డ్ రికార్డ్‌ ను గిన్నీస్ బుక్‌ వారు కట్టబెట్టారు అంటూ సుమ పోస్ట్‌ చేసింది.

73 ఏళ్ల పాటు లాయర్ గా విధులు నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆయన ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే కచ్చితంగా వరల్డ్‌ రికార్డ్‌ కి అర్హుడే అంటూ సుమను సోషల్‌ మీడియా ద్వారా ఫాలో అయ్యే వారు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సుమ తనయుడు రోషన్‌ కనకాల విషయానికి వస్తే హీరోగా బబుల్ గమ్‌ సినిమా తో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మరో అర్జున్ రెడ్డి రేంజ్ లో ఉండబోతుందా అన్నట్లుగా చర్చ జరుగుతోంది. తాజాగా విడుదలైన టీజర్ మరియు పోస్టర్లు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. డిసెంబర్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.